Breaking News

‘బొంభాట్‌’ సాంగ్ రిలీజ్​

దర్శకేంద్రుడు కె.రాఘవేందర్​రావు సమర్పణలో సుచేత డ్రీమ్ వర్క్ ప్రొడ‌క్షన్స్​ బ్యాన‌ర్‌పై ‘ఈ న‌గ‌రానికి ఏమైంది’ ఫేమ్ సుశాంత్ హీరోగా, సిమ్రాన్, చాందిని హీరోయిన్స్‌గా రాఘ‌వేంద్ర వర్మ(బుజ్జి) డైరెక్షన్​లో విశ్వాస్ హ‌నూర్‌క‌ర్ నిర్మిస్తున్న చిత్రం ‘బొంభాట్‌’. జోష్ బి సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో రెండో లిరిక‌ల్ వీడియో సాంగ్ ‘స్వామినాథ‌’ను శుక్రవారం రిలీజ్​చేశారు.
‘బుద్ధిగా కలగన్నా బుజ్జిగా ఎదపైన
సర్జికల్ స్ట్రైక్ ఏదో జరిగిందిరా
అన్నీ దిక్కులలోన ఆక్సిజన్ జడివాన..
స్వామినాథ’

….అంటూ సాగే ఈ పాట హీరో హీరోయిన్ మధ్య సాగే రొమాంటిక్ లవ్ సాంగ్. ఈ పాట‌ను ప్రముఖ గేయ ర‌చ‌యిత రామ‌జోగయ్య శాస్త్రి రాయ‌గా జోష్‌.బి సంగీతం అందించారు. చందనబాల కల్యాణ్, కార్తీక్, హరిణి పాటను ఆలపించారు. రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందుతున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడ‌క్షన్​ కార్యక్రమాలను జరుపుకుంటోంది. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ప్లాన్​ చేస్తున్నారు.