Breaking News

బహిరంగ చర్చకు సిద్ధమేనా?

బహిరంగ చర్చకు సిద్ధమేనా?

సారథి న్యూస్, రామడుగు: నియోజకవర్గ అభివృద్ధి, సాగు, తాగునీటి విషయంలో బహిరంగ చర్చకు రావాలని టీఆర్ఎస్ నేతలకు కరీంనగర్​ జిల్లా కాంగ్రెస్ బీసీసెల్​అధ్యక్షుడు పులి ఆంజనేయులు సవాల్ విసిరారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. అభివృద్ధిలో చొప్పదండి వెనకబడి ఉందన్నారు. తూముల నిర్మాణం విషయంలో మేడిపల్లి సత్యంపై అసత్య ఆరోపణలు తగవన్నారు. మాల్యాల నుంచి కోదురుపాక వరకు వరద కాల్వకు ఎన్ని తూములు ఉన్నాయి, వాటికి ఎంత కేటాయించారో చెప్పాలని నిలదీశారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు ఐదు కి.మీ. దూరంలోని పరీవాహక ప్రాంతాల్లోని రైతులు 8లక్షలతో మోటార్లు వేసుకున్నా.. చెరువులు నింపిన పాపాన పోలేదన్నారు. పక్కనే ఉన్న చిప్పకుర్తి ఏర్పాటు చేయమని 2017లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నాచేస్తే కేసులు పెట్టించారని ఆవేదన వ్యక్తం చేశారు. సమావేశంలో పార్టీ మండలాధ్యక్షుడు బొమ్మరవేణి తిరుపతి ముదిరాజ్, వన్నారం ఎంపీటీసీ జవ్వాజి హరీశ్, బాపిరాజు, అసిఫ్, జక్కుల బాబు, కట్ల శంకర్, కర్నె శ్రీను, ఎలికొండ ప్రవీణ్ పాల్గొన్నారు.