Breaking News

ప్రతిభను వెలికితీసేందుకే ‘ఇగ్నైట్​’

ప్రతిభను వెలికితీసేందుకే ‘ఇగ్నైట్​’

సారథి న్యూస్, బిజినేపల్లి: గురుకుల విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభా పాటవాలను వెలికితీసేందుకు ఆదివారం నాగర్​కర్నూల్ ​జిల్లా బిజినేపల్లి సాంఘిక సంక్షేమశాఖ బాలుర గురుకుల పాఠశాలలో ‘మన ఊరికే.. మన గురుకులం’ కార్యక్రమంలో భాగంగా ‘యురేకా..2020’ పేరుతో ‘ఇగ్నైట్​’ ప్రోగ్రాం​ నిర్వహించారు. ముఖ్యఅతిథిగా అసిస్టెంట్ ​ఆర్సీవో వెంకటేశ్వర్లు హాజరయ్యారు. ప్రిన్సిపల్ ​పానుగంటి రాములు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. కరోనా సమయంలో విద్యార్థులు చదువులకు దూరం కాకూడదనే సంకల్పంతో గురుకులాల కార్యదర్శి డాక్టర్ ​ఆర్ఎస్ ​ప్రవీణ్​కుమార్ ​ఆలోచన మేరకు ఇగ్నైట్​కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. ఎన్నో వినూత్న మార్గాలను అనుసరిస్తూ, అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ, విద్యార్థుల ప్రగతిబాటకు దారులు వేస్తూనే ఉన్నామని చెప్పారు. వనపర్తిలో 75 మంది విద్యార్థులు, పాలెంలో 106 మంది విద్యార్థులు ‘ఇగ్నైట్’​ కార్యక్రమంలో పాల్గొన్నారని వివరించారు. అందులో భాగంగానే వ్యాసరచన పోటీలు, డాన్స్​లు, బుక్ రివ్యూ, డిబేట్, పాటల పోటీలు నిర్వహించి 76 మందికి నగదు బహుమతులు, ప్రశంసాపత్రాలు అందజేశామని తెలిపారు. కార్యక్రమంలో పాలెం సర్పంచ్ లావణ్య, వైస్ ప్రిన్సిపల్ చిన్నస్వామి, ఉపాధ్యాయులు ప్రవీణ్ కుమార్, సుజాత, కవిత, శోభ, శంకర్, రాజేంద్రప్రసాద్, లీలావతి, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నా