Breaking News

పాలెం వాగు ప్రధాన కాల్వను పూర్తిచేయండి

పాలెం వాగు ప్రధానకాల్వను పూర్తిచేయండి

సారథి న్యూస్, వెంకటాపూర్​: తమది రైతు ప్రభుత్వమని చెప్పుకునే టీఆర్​ఎస్​ నాయకులు చేతల్లో చూపడం లేదని ములుగు జిల్లా వెంకటాపూర్​ ఎంపీపీ చెరుకూరి సతీష్ కుమార్ విమర్శించారు. ఈ మేరకు పాలెం వాగు ప్రాజెక్ట్ ప్రధాన కాల్వను సందర్శించారు. ప్రాజెక్టును ప్రారంభించి ఏళ్లు గడుస్తున్నా ఇప్పటికీ ప్రధాన కాల్వ, పిల్ల కాల్వలను నిర్మించకపోవడం సిగ్గుచేటన్నారు. నేటికీ బర్లగూడెం పంచాయతీ రైతులకు నీళ్లు అందడం లేదన్నారు. పాలెం వాగు ప్రాజెక్ట్ నిర్మాణంపై ఎందుకు దృష్టిపెట్టడం లేదని ప్రశ్నించారు. పిల్ల కాల్వలు లేక రైతులు ఆయిల్​ ఇంజన్లను ఏర్పాటు చేసుకుని కిలోమీటర్ల కొద్దీ నీళ్లను తోడుకునే పరిస్థితి ఏర్పడిందన్నారు. నీటి పారుదలశాఖ మంత్రి తక్షణమే స్పందించి పాలెం వాగు ప్రాజెక్టు పనులను పూర్తిచేయాలని డిమాండ్​చేశారు. ఆయన వెంట కాంగ్రెస్ కిసాన్ సెల్ మండలాధ్యక్షుడు చంద్రకళాధర్ రావు, సర్పంచ్ సమ్మయ్య, పుల్లయ్య ఉన్నారు.