Breaking News

నకిలీ సీడ్స్​ పట్టివేత

సారథి న్యూస్​, రామడుగు: నియంత్రిత విధానం ద్వారా పంటలు సాగు ద్వారా వరిని తగ్గించి పత్తి వంటి వాణిజ్య పంటల సాగుపై దృష్టిపెట్టాలని ఓ వైపు ప్రభుత్వం అవగాహన సదస్సులు నిర్వహిస్తుంటే మరోవైపు నకిలీ విత్తనాల విక్రయాల జోరు ఊపందుకుంది. కరీంనగర్​ జిల్లా రామడుగు మండలంలోని వెదిరలో శనివారం నకిలీ పత్తి విత్తనాలు విక్రయిస్తున్న ఇంటిపై వ్యవసాయ, పోలీస్ అధికారులు దాడిచేసి పట్టుకున్నారు. రూ.1.4లక్షల విలువైన విత్తనాలు, 40 గ్రాముల ప్యాకెట్లు 126, 13కిలోల సీడ్సను స్వాధీనం చేసుకున్నారు. చొప్పదండి ఏడీఏ రామారావు, సీఐ రమేష్, ఎస్సై అనూష, పరిశీలించారు.