Breaking News

క్రేజీ యాంకర్.. క్రేజీ లుక్స్

ఇద్దరి పిల్లలకు తల్లయినా యాంకర్ అనసూయ భరద్వాజ్​ కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. అటు బుల్లి తెరపైనా.. వెండి తెరపైన కూడా అనసూయకు ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఎక్కువే. అంతకంటే సోషల్ మీడియాలో ఆమె చేసే పోస్ట్​లకు ఫిదా అయిపోతున్నవాళ్లెందరో ఉన్నారు. రీసెంట్​గా నల్లచీర, నల్లపూసలతో ఉన్న ఫొటోలను పోస్ట్ చేసింది అనసూయ. చూడడానికి సంప్రదాయ బద్దంగా ఉన్నా కూడా ఆ ఫొటోల్లో హాట్​నెస్​ కూడా అంతే ఉండడంతో ఫ్యాన్స్ రెచ్చిపోయి కమెంట్స్ పెడుతున్నారు. ‘హీరోయిన్స్ స్థాయిలో మీ అందం ఉంది అని కొంతమంది అంటుంటే.. మరికొందరు మాత్రం నీ అందాలు చూపేందుకు నీకింత తాపత్రయం అవసరమా’ అంటున్నారు. ఏదేమైనా తన సోయగాలను మాత్రం చూపించడం ఆపడం లేదు అనసూయ. చూసేవాళ్లూ ఆగడం లేదు.. అందుకే వీటికి బోలెడన్ని వ్యూస్.. లైక్స్ మాత్రం వచ్చేస్తున్నాయి.