Breaking News

కాల్వల పనులు కంప్లీట్​ చేయండి

సారథి న్యూస్, మెదక్: కొండపోచమ్మ జలాశయానికి గోదావరి జలాలు వచ్చిన నేపథ్యంలో సంగారెడ్డి, రామాయంపేట ప్రాంతాల్లో కాల్వ పనులను తొందరగా పూర్తిచేయాలని ఇరిగేషన్ అధికారులను మంత్రి హరీశ్ రావు ఆదేశించారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ కోమటిబండపై మిషన్ భగీరథ భవన్ లో ఆదివారం మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి, నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి, దుబ్బాక ఎమ్మెల్యే రామలింగారెడ్డి, మెదక్ కలెక్టర్ ధర్మారెడ్డి, ఇరిగేషన్ ఎస్ఈ వేణుతో కలిసి పనుల పురోగతిపై సమీక్ష సమావేశం నిర్వహించారు.

భూసేకరణకు రూ.36 కోట్ల నిధులను సీఎం దృష్టికి తీసుకెళ్లి మంజూరు చేయిస్తానని చెప్పారు.రామాయంపేట, చిన్నశంకరంపేట, తూఫ్రాన్ మండలం కిష్టాపూర్, సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం ఉప్పర్ పల్లి ప్రాంతాల్లోని కాల్వ పనులను నెలరోజుల్లో పూర్తి చేయాలని ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. 54 కి.మీ.కాల్వ మొత్తంలో 40 కి.మీ. సిద్దిపేట జిల్లాలో పనులు పూర్తయ్యాయని, పలుచోట్ల అసంపూర్తి బాటిల్ నెక్స్ పనులు ఉన్నాయని తెలిపారు.అలాగే భూసేకరణను త్వరగా పూర్తిచేయాలని కలెక్టర్​ను కోరారు. సమీక్ష సమావేశంలో ఇరిగేషన్ ఈఈ బద్రి నారాయణ, డీఈ మోతయ్య, సిబ్బంది, ఏజెన్సీ ప్రతినిధులు పాల్గొన్నారు.