Breaking News

కర్నూలు మార్కెట్​ చైర్మన్​గా రోకియాబీ

కర్నూలు మార్కెట్​ చైర్మన్​గా రోకియాబీ

  • వైస్‌ చైర్మన్‌గా కేశవరెడ్డి గారి రాఘవేంద్రరెడ్డి
  • ఉత్తర్వులు జారీచేసిన ఆంధ్రప్రదేశ్​ ప్రభుత్వం

సారథి న్యూస్​, కర్నూలు: కర్నూలు వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌గా కోటిముల్లా రోకియా బీని నియమించినట్లు రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీచేసింది. కమిటీ గౌరవాధ్యక్షుడిగా కర్నూలు నగర ఎమ్మెల్యే ఎంఏ హఫీజ్‌ఖాన్‌ను నియమిస్తూ కమిటీ చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌, సభ్యుల పేర్లను ఖరారుచేసింది. కమిటీ అధ్యక్షుడిగా కోటిముల్లా రోకియాబీ, ఉపాధ్యక్షుడిగా కేశవ రెడ్డి గారి రాఘవేంద్ర రెడ్డి, సభ్యులుగా సాంబశివారెడ్డి, మధుసూదన్‌ రెడ్డి, మహబూబ్‌ బాషా, ఎర్రన్న, వెంకటేశ్వరమ్మ, షేక్‌ రెహమత్​బీ, తాటిపట్టి చెన్నమ్మ, మంగమ్మ, గడ్డ జానకమ్మ, ఖలీల్‌, ఫిరోజ్‌ ఖాన్‌, శ్రీలత, బండి ఇబ్రహీం, రంగన్న కమిటీ సభ్యులుగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఎంఏ హఫీజ్‌ఖాన్‌ మాట్లాడుతూ.. బడుగు బలహీనవర్గాలకు న్యాయం జరిగేలా నామినేటెడ్‌ పదవులను రాష్ట్ర ప్రభుత్వం అప్పగించిందని అన్నారు. బాధ్యతతో పనిచేసి ప్రభుత్వానికి మంచిపేరు తేవాలని కోరారు.