Breaking News

ఒక్కో మండపానికి రూ.50వేలు

ఒక్కో మండపానికి రూ.50వేలు
  • నవరాత్రి ఉత్సవాలకు బెంగాల్ సీఎం మమత బంపర్ ఆఫర్

కలకత్తా: పశ్చిమబెంగాల్లో అత్యంత వైభవంగా జరిగే దుర్గాదేవి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరపడానికి ఆ రాష్ట్ర సీఎం మమతా బెనర్జీ ముందుకొచ్చారు. ఒక్కో మండపానికి రూ.50 ఆర్థికసాయం ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 35 వేలకు పైగా దుర్గా పూజా కమిటీలు ఉన్నాయి. ఇందులో కలకత్తా లోనే సుమారు 2,500కు పైగా ఉంటాయి. వీటన్నింటికీ ఒక్కో మండపానికి రూ.50వేల చొప్పున ఇస్తున్నట్టు సీఎం తెలిపారు. కరోనా మహమ్మారి సంక్షోభంతో రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు ఉపాధి కోల్పోయిన నేపథ్యంలో ఉత్సవాలు జరపడానికి పూజా కమిటీల నిర్వాహకులు చందాలు వసూలు చేయడం లేదు. దీంతో ఉత్సవాల భారం నిర్వాహకులపైనే పడనుంది. ఈ విషయాన్ని కమిటీలు సీఎం దృష్టికి తీసుకెళ్లాయి. మండపాలకు వినియోగించే కరెంట్​ బిల్లులపై కూడా 50శాతం మాఫీ చేస్తామని మమతా బెనర్జీ వెల్లడించారు. బెంగాల్ వారసత్వాన్ని, సంస్కృతి సంప్రదాయాలను కాపాడడంలో భాగంగానే ఈ ఆర్థిక సాయం ప్రకటిస్తున్నట్టు ఆమె తెలిపారు. ఇందుకోసం రాష్ట్ర ఖజానా నుంచి రూ.140 కోట్లు వెచ్చించనున్నారు. అన్నీ బాగుంటే వచ్చే ఏడాది నవరాత్రి ఉత్సవాలను మరింత ఘనంగా జరుపుతామని బెనర్జీ పేర్కొన్నారు.