Breaking News

ఐఐటీ జేఈఈ మెయిన్స్ లో విద్యార్థుల హవా

ఐఐటీ జేఈఈ మెయిన్స్లో శ్రీ చైతన్య విద్యార్థుల హవా

సారథి న్యూస్​, కర్నూలు: ఐఐటీ జేఈఈ మెయిన్స్ ఎంట్రన్స్ 2020 పరీక్షల్లో కర్నూలు శ్రీ చైతన్య విద్యార్థులు జాతీయస్థాయిలో అత్యుత్తమ ఫలితాలు సాధించినట్లు యాజమాన్యం శనివారం ఒక ప్రకటనలో తెలిపింది. జాతీయ స్థాయిలో 100 కు 100 పర్సెంటేజ్ సాధించిన విద్యార్థుల సంఖ్య 24, అందులో శ్రీ చైతన్య విద్యార్థులు ఏడుగురు ఉన్నారు. వివిధ కేటగిరీల్లో జి.చంద్రడేవిడ్ 164, ఆర్.సుధాకర్ నాయక్ 311, పి.వంశీకృష్ణ 919వ ర్యాంకులు సాధించినందుకు ఏజీఎం మురళీకృష్ణ అభినందించారు. బి.శ్రీజ 98.58, హెచ్ కార్తీక్ 98.11, ఎం శ్రీపావని 97.88, హెచ్.అలేఖ్య 97.68, డి.సాయి వికాస్ 97.68, వి.మౌనిక 97.01 ఉత్తమ పర్సెంటైల్, ర్యాంకులు సాధించారు. ఉత్తమ ప్రతిభచూపిన విద్యార్థులను ఎంజీఎం మురళీకృష్ణ, డీన్ సరళ, ప్రిన్సిపల్స్ అభినందించారు. మొత్తం 928 మంది విద్యార్థులు మెయిన్స్ పరీక్షకు హాజరు కాగా అందులో 258 మంది ఐఐటీ అడ్వాన్స్ కు అర్హత సాధించారు.