Breaking News

ఏపీలో కొత్తగా 702 కేసులు

ఏపీలో కొత్తగా 702 కేసులు

సారథి న్యూస్​, కర్నూలు: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. రాష్ట్రంలో 24 గంటల్లో 704 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. వీటిలో ఆరుగురు విదేశాలకు చెందినవారు కాగా.. వేరు రాష్ట్రాలకు చెందిన వారు 51 మంది. రాష్ట్రంలో 684 పాజిటివ్‌ కేసులు వచ్చినట్లు అధికారులు హెల్త్‌ బులిటెన్‌ రిలీజ్‌ చేశారు. వ్యాధి బారిన పడి 24 గంటల్లో ఏడుగురు చనిపోయారు. కృష్ణా జిల్లాలో ముగ్గురు, కర్నూలులో ఇద్దరు, గుంటూరు, అనంతపురం జిల్లాల్లో ఒక్కోరు చనిపోయారు. దీంతో ఇప్పటి వరకు చనిపోయిన వారి సంఖ్య 187కి చేరింది. 6,511 మంది డిశ్చార్జ్‌ కాగా, 7,897 మంది హాస్పిటల్‌లో ట్రీట్‌మెంట్‌ తీసుకుంటున్నారు. 24 గంటల్లో 18,114 శ్యాంపిల్స్‌ను టెస్ట్‌ చేశారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 8,90,190 శ్యాంపిళ్లను పరీక్షించారు.