Breaking News

ఆహ్లాదభరితం.. ఆనందమయం

ఆహ్లాదభరితం.. ఆనందమయం

  • ప్రకృతి అందాలను తిలకించేందుకు ఆసక్తి చూపుతున్న ప్రేమికులు
  • శ్రీశైలం, సుంకేసుల, జూరాల, అవుకుకు వెళ్లేందుకు టూరిస్టుల ఆసక్తి

సారథి న్యూస్, కర్నూలు: కరోనా ముప్పు ఇప్పుడిప్పుడే తొలగిపోయినట్టు కనిపిస్తోంది. జిల్లాలోని ప్రకృతి అందాలను ఆస్వాదించేందుకు పలువురు టూరిస్టులు ఆసక్తి చూపుతున్నారు. కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాల నుంచి వరద నీరు భారీగా తరలివస్తుండడంతో తుంగభద్ర, కృష్ణానదులు ఉవ్వెత్తున ప్రవహిస్తున్నాయి. ఆల్మట్టి , నారాయణ్‌పూర్‌ డ్యాం గేట్లు ఎత్తడంతో జూరాలకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. వరదనీరు ఉధృతికి వారం రోజులుగా జూరాల గేట్లను ఎత్తి శ్రీశైలం డ్యాంకు నీటిని వదులుతున్నారు. నీటి పరవళ్ల సవ్వడిని తిలకించి.. ప్రకృతిని ఆస్వాదించేందుకు ప్రకృతి ప్రేమికులు పెద్దసంఖ్యలో తరలివస్తున్నారు. ప్రాజెక్టుకు వెళ్లే మార్గమధ్యంలో ఉన్న జోగులాంబ గద్వాల, శ్రీశైలం మల్లన్న తదితర సమీప పుణ్యక్షేత్రాలను దర్శించుకుని పునీతులవుతున్నారు.

జూరాల ప్రాజెక్టు వద్ద పర్యాటకుల సందడి