Breaking News

అయ్యో.. నంబర్​ 1 పాయే

అయ్యో.. నంబర్​ 1 పాయే

ర్యాంక్స్​ ప్రకటించిన ఐసీసీ

దుబాయ్: టెస్టుల్లో టీమిండియా నంబర్​ వన్​ ర్యాంక్ గల్లంతైంది. ఐసీసీ తాజాగా విడుదల చేసిన ర్యాంకింగ్స్​ లో  విరాట్​ సేన 114 రేటింగ్ పాయింట్లతో మూడవ స్థానానికి పడిపోయింది. ఆస్ర్టేలియా 116 పాయింట్లతో కొత్తగా అగ్రస్థానంలోకి దూసుకురాగా, న్యూజిలాండ్ (115) రెండవ ర్యాంక్​ లో నిలిచింది.

2016 అక్టోబర్​ లో తొలిసారి నంబర్​ వన్​ ర్యాంక్​ ను చేజిక్కించుకున్న టీమిండియా దాదాపు 42నెలల పాటు ఈ ర్యాంక్​ లో కొనసాగింది. అయితే ఐసీసీ రూల్ ప్రకారం 2016–17 సీజన్​ లో ఇండియా సాధించిన 12 టెస్ట్ విజయాలు, ఒక ఓటమిని తాజా ర్యాంకింగ్స్​ లో పరిగణనలోకి తీసుకోకపోవడంతో నంబర్​ వన్​ ర్యాంక్ చేజారింది. తాజా ర్యాంకింగ్స్​ కు సంబంధించి 2019 మే నుంచి ఆడిన మ్యాచ్​ లకు 100 శాతం, రెండేళ్ల ప్రదర్శనకు 50 శాతం రేటింగ్ పాయింట్ల పరిగణనలోకి తీసుకుంది. ఇక ఆస్ట్రేలియా (278) టీ 20ల్లో తొలిసారి నంబర్​ వన్​ ర్యాంక్​ ను కైవసం చేసుకుంది.

ఇంగ్లండ్‌(268), ఇండియా (266), పాకిస్థాన్‌(260), సౌతాఫ్రికా (258) వరుసగా టాప్‌–5లో కొనసాగుతున్నాయి. వన్డేల్లో ఇంగ్లండ్‌(127) నంబర్‌వన్‌ ర్యాంక్‌ నిలబెట్టుకుంది. రెండవ స్థానంలో ఉన్న  ఇండియా(119) కంటే 8 పాయింట్ల ఆధిక్యంలో నిలిచింది. న్యూజిలాండ్‌(116), సౌతాఫ్రికా (108), ఆస్ట్రేలియా (107) వరుసగా మూడు, నాలుగు, ఐదు ర్యాంకుల్లో ఉన్నాయి.