Breaking News

వైభవంగా రాములోరి కల్యాణం

వైభవంగా రాములోరి కల్యాణం

సారథి, మానవపాడు/రామడుగు: జోగుళాంబ గద్వాల జిల్లా ఉండవెల్లి మండలం, పుల్లూరు గ్రామంలో సీతారాముల కల్యాణ మహోత్సవ వేడుకలు కరోనా నియమ నిబంధనలు పాటిస్తూ భక్తిశ్రద్ధలతో జరిగాయి. కరోనా చీకట్లు తొలగిపోయి ప్రజలంతా ఆరోగ్యంగా ఉండేలా రైతులకు సకాలంలో వర్షాలు పడుతూ అన్నివర్గాల ప్రజలు, వ్యాపారులు అభివృద్ధి చెంది నిండునూరేళ్లు అష్టఐశ్వర్యాలతో సుఖసంతోషాలతో జీవించాలని మనస్ఫూర్తిగా ఆ స్వామి వారిని పుల్లూరు గ్రామ ప్రజలు పూజించారు.

పట్టువస్త్రాలు సమర్పిస్తున్న దంపతులు

– కరీంనగర్ జిల్లా రామడుగు మండల కేంద్రంలో సీతారాముల కల్యాణానికి భద్రాచలం వాస్తవ్యులు సబ్బాని మాధవి శ్రీనివాస్ దంపతులు విచ్చేసి స్వామివారు, అమ్మవారికి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు బహూకరించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ దంపతులు మాట్లాడుతూ సీతారాముల వారి కల్యాణానికి పట్టు వస్త్రాలు,ముత్యాల తలంబ్రాలు, అక్షింతలు ఇవ్వడం తమ అదృష్టంగా భావిస్తున్నామని అన్నారు. ప్రజలంతా సుఖసంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని, కరోనా మహమ్మారి ఈ దేశాన్ని వదిలి పోయి ప్రజలంతా సుఖశాంతులతో ఉండాలని స్వామి వారిని వేడుకున్నారు.