Breaking News

14 రోజుల ఐసోలేషన్​ తప్పనిసరి

దుబాయ్​: కరోనా కారణంగా ఆగిపోయిన అంతర్జాతీయ క్రికెట్​ను మొదలుపెట్టేందుకు ఐసీసీ సిద్ధమైంది. ఇందుకోసం కొన్ని మార్గదర్శకాలు రూపొందించింది. ప్రతిజట్టు 14 రోజుల ప్రీ మ్యాచ్​ ఐసోలేషన్​ను తప్పనిసరిగా పాటించాలని సూచించింది. అలాగే అన్ని జట్లు మెడికల్​ ఆఫీసర్​ను నియమించుకోవాలని ఆదేశించింది. మొత్తం నాలుగు దశల్లో క్రికెట్​ను పూర్తి స్థాయిలో మొదలుపెట్టనున్నారు. ‘క్రికెటర్లు ఫిట్​నెస్​ కోల్పోకుండా చిన్నచిన్న కసరత్తులతో ప్రాక్టీస్​ మొదలుపెట్టాలి. తర్వాత ఇద్దరు, ముగ్గురుగా గ్రూపు శిక్షణ చేసుకోవచ్చు. మూడో దశలో కోచ్​ పర్యవేక్షణలో పదిమంది కలిసి ప్రాక్టీస్​ చేయాలి.

నాలుగో దశలో సంఖ్యను పెంచి జట్ల వారీగా ప్రాక్టీస్​కు వెసులుబాటు కల్పించింది. శిక్షణ సమయంలో ప్లేయర్లు టాయిలెట్​కు వెళ్లకుండా చూడాలి. క్యాప్​లు, సన్​ గ్లాసెస్​ వేరే వాళ్లకు ఇవ్వకూడదు. అంపైర్లు బంతిని పట్టుకోవాలంటే చేతులకు గ్లౌస్​​లు ధరించాలి. ఆటగాళ్ల మధ్య ఒకటిన్నర మీటర్ల దూరం తప్పనిసరి. వ్యక్తిగత కిట్లు, సామగ్రిని ఎప్పటికప్పుడు శానిటైజ్​ చేసుకోవాలి. నిరంతరం ఉష్ణోగ్రత చెక్​ చేస్తూ ఉండాలి. అవసరమైతే కరోనా పరీక్షలు నిర్వహించాలి’ అని ఐసీసీ మెడికల్​ కమిటీ వెల్లడించింది.