Breaking News

క్వీన్​ వచ్చేస్తోంది..

సీనియర్ నటీమణుల్లో ఒకరైన రమ్యకృష్ణ సౌత్ ఇండస్ట్రీలో ఆమెకంటూ ఓ స్థానం ఉంది. నీలాంబరి, శివగామి పాత్రల్లో ఒదిగిపోయిన ఆమె నటనకు పట్టం కట్టని ప్రేక్షకుడు లేడు. రీసెంట్​గా రమ్యకృష్ణ మెయిన్ రోల్​గా ‘క్వీన్’ వెబ్ సిరీస్​లో నటించింది. గౌతమ్ మీనన్ నిర్మాణంలో తెరకెక్కిన ఈ వెబ్ సీరీస్ కు గౌతమ్ మేనన్ తో పాటు ప్రసత్ మురుగేసన్ దర్శకత్వం వహించారు. ఈ వెబ్ సీరీస్ తమిళనాడు మాజీ సీఎం ‘అమ్మ’ జయలలిత జీవితం ఆధారంగా తెరకెక్కిందని మొదట్లో ప్రచారం జరిగింది కానీ దర్శకనిర్మాతలు మాత్రం ఈ సినిమా జయలలిత కథ కాదంటున్నారు. ఎంత కాదని చెప్పినప్పటికీ అది జయలిత జీవితమేనని చూసిన వారు అంటున్నారు.
త్వరలో ఈ వెబ్ సీరీస్ సెకండ్ సీజన్ షూటింగ్ ప్రారంభం కానుంది. ఈమధ్య ఒక ఇంటర్వ్యూలో రమ్యకృష్ణ మాట్లాడుతూ ఈ వెబ్ సీరీస్ అనిత శివకుమారన్ రాసిన ‘క్వీన్’ అనే పుస్తకం ఆధారంగా రూపొందుతోంది. శక్తి శేషాద్రి అనే ఓ బలమైన వ్యక్తిత్వం ఉన్న మహిళ జీవితంలో జరిగిన సంఘటనల సమాహారమే ఈ కథ అని రమ్యకృష్ణ వెల్లడించారు. ఆమె తన జీవితంలో ఎదురైన అడ్డంకులను ఎలా అధిగమించి విజయం సాధించారనేది ఈ కథలో ఉంటుందని చెప్పారు.
మొదటి సీజన్ కంటే రెండవ సీజన్ థ్రిల్లింగ్ గా.. మరింత ఆసక్తికరంగా ఉండటమే కాదు.. ఈ సీజన్ లో శక్తి శేషాద్రి పాత్ర రాజకీయ నాయకురాలిగా ఎదిగే పయనం ఉంటుందన్నారు. ‘క్వీన్’ మొదటి సీజన్ ఎమ్ ఎక్స్ ప్లేయర్ లో స్ట్రీమింగ్ అయింది. ఓటీటీ లోనే కాకుండా జూన్ 6 నుంచి జీ టీవీలోనూ ప్రసారం కానుంది.