Breaking News

‘క్లైమాక్స్’తో కిక్కెస్తున్న వర్మ

‘క్లైమాక్స్’తో కిక్కెస్తున్న వర్మ
‘క్లైమాక్స్’తో కిక్కెస్తున్న వర్మ

– టీజర్ విడుదల చేసిన ఆర్​జీవీ

రామ్ గోపాల్ వర్మ రెండేళ్ల క్రితం తీసిన ‘జీఎస్టీ’ (గాడ్ సెక్స్ అండ్ ట్రూత్) అనే షార్ట్ ఫిల్మ్‌ఎంత పెద్ద కాంట్రవర్సీకి దారి తీసిందో అందరికీ తెలిసిందే.. ఆ షార్ట్​ ఫిల్మ్​ ను అమెరికాకు చెందిన పోర్న్ స్టార్ మియా మాల్కోవాతో తీసి ఎన్ని విమర్శలొచ్చినా తాను అనుకున్నది సాధించి ఆ డాక్యుమెంటరీని రిలీజ్ చేశాడు ఆర్జీవీ. మియా మాల్కోవా అందానికి తలమునకలైపోయిన వర్మ ఆమెను తెగ పొగిడేయడమే కాదు ఆమెలో అద్భుతనటి దాగుందని ఇప్పుడింకో సినిమాప్లాన్ చేశాడు. అంతటితో ఊరుకోలేదు, సైలెంట్‌గా తన పని కానిచ్చేశాడు కూడా.. అంటే ఆమెతో ‘క్లైమాక్స్’ అన్న సినిమా తీసేశాడు. శ్రేయాస్ ఎంటర్‌టైన్​మెంట్​, ఆర్ఎస్ఆర్ ప్రొడక్షన్స్ కలిసి ఈ చిత్రాన్ని నిర్మించాయి. ఇది ఒక థ్రిల్లర్ అని చెబుతూ.. ఈ సినిమాలో మియా యాక్టింగ్ టాలెంట్ చూసి అంతా షాకవుతారని చెప్పి టీజర్‌‌పై అంచనాలు పెంచాడు.

గురువారం సాయంత్రం ఈ టీజర్ విడుదలైంది. వర్మ, మియాల కాంబో అంటే ఎలా ఉంటుందని జనాలు ఊహిస్తారో.. దానికి ఏమాత్రం తగ్గకుండానే ఉంది. టీజర్ ప్రారంభంలోనే మియా గ్లామర్‌‌ను దిట్టంగా చూపిస్తూ.. వెళ్లేకొద్దీ మరింత మసాలా పెంచేశాడు వర్మ. ఎడారిలోని ఒయాసిస్సులో హీరో, హీరోయిన్లతో తీసిన సీన్‌అయితే ఫుల్ రొమాన్స్ జొప్పించి కుర్రకారు గుండెళ్లో రైళ్లు పరిగెత్తేలా చేశాడు. ఆ తర్వాత వాళ్లని కొంతమంది రౌడీలు వెంటాడడం చూసి మియా భయంతో వణికిపోవడాన్ని బట్టి ఇది కచ్చితంగా థ్రిల్లరే అనిపిస్తోంది. టీజర్ చూస్తే ఈ సారి ఈ సినిమా వర్మ అభిమానులను వీపరీతమైన ఎంటర్​టైన్​ చేయడం ఖాయమనిపిస్తోంది.