Breaking News

వారికి మాస్క్‌ పాఠం

వారికి మాస్క్‌ పాఠం

ఇండియాలో ఇటీవల కాలంలో విపరీతంగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఇప్పటి వరకు సుమారు 9.50లక్షల మంది కరోనా బారినపడ్డారు. 25వేల మంది దాకా మృత్యువు పాలయ్యారు. కరోనాను కట్టడి చేసేందుకు ప్రభుత్వాలు అనేక కార్యక్రమాలు చేపడుతున్నాయి. ప్రజలకు అనేక రకాల సూచనలు చేస్తున్నాయి. కానీ, చాలామంది వాటిని పట్టించుకోవడం లేదు. దీంతో కోవిడ్‌ వైరస్‌ చాలా ఉధృతంగా విస్తరిస్తోంది. కరోనా కట్టడికి ప్రధానంగా అందరూ మాస్కులు కట్టుకోవాలని ప్రభుత్వాలు నిర్దేశించాయి. మాస్కు లేకుండా బయటకు వెళ్తే జరిమానాలు కూడా విధిస్తున్నాయి. అయినా, చాలామంది మాస్కులు లేకుండానే బయట తిరుగుతున్నారు. ఈ నేపథ్యంలో ఇలాంటి వారిని కట్టడి చేసేందుకు విచిత్రమైన శిక్షలు విధించాలని నిర్ణయించింది.
500 సార్లు ఇంపోజిషన్‌
ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలోని ఫిరోజాబాద్‌ జిల్లా యంత్రాంగం. ఇటువంటి వారితో మాస్కు తప్పనిసరిగా పెట్టుకోవాలనే వాక్యాన్ని 500 సార్లు ఇంపోజిషన్‌ రాయించాలని డిసైడైంది. ఈ శిక్షకు మాస్కు పాఠం అనే పేరును కూడా అక్కడి అధికారులు నిర్ణయించారు. వీధుల్లో మాస్కులు లేకుండా తిరుగుతున్న వారిని ఓ తరగతి గదిలో కూర్చోపెట్టి ఈ శిక్షను అమలు చేస్తారని సమాచారం. ఇందులో మొట్టమొదటగా.. మాస్కు ఉపయోగాలను తెలియజేసే ఓ వీడియోను మాస్కు పెట్టుకోని వ్యక్తులకు చూపిస్తారు. అనంతరం.. వారితో మాస్కు తప్పనిసరిగా పెట్టుకోవాలి అనే వాక్యాన్ని ఐదొందల సార్లు ఇంపోజిషన్‌ రాయిస్తున్నారు. ఈ మొత్తం వ్యవహారమంతా పూర్తయ్యే సరికి వీరు ఏకంగా మూడు నాలుగు గంటల పాటు క్లాస్‌ రూంలో గడపాల్సి వస్తుందని తెలుస్తోంది. నిబంధనలు ఉల్లంఘించే వారిపై కేసులు పెట్టే బదులు ఈ రకమైన శిక్షలు విధిస్తే ఆశించిన ఫలితాలు సులువుగా వస్తాయని జిల్లా యంత్రాంగం భావిస్తోంది. ఇవి ఏ మేరకు సఫలమవుతాయో చూడాల్సిందే.