Breaking News

రాశి రీ ఎంట్రీ

నైన్టీస్​లో ‘శుభాకాంక్షలు’, ‘గోకులంలో సీత’, ‘పెళ్లిపందిరి’ సినిమాలతో తెలుగు ప్రేక్షకులను అలరించిన రాశి అటు సౌత్, నార్త్ లో కూడా సినిమాలు చేసి మంచి హీరోయిన్ అనిపించుకుంది. అయితే హీరోయిన్ రాశి మళ్లీ ఫామ్ లోకి వచ్చింది. కొన్నినెలల క్రితం రాశి చాలా లావు అవడం కారణంగా చాలా ట్రోల్స్​కు గురైంది. చాలాకాలం గ్యాప్ తర్వాత కోలీవుడ్​లో ఎంట్రీ ఇచ్చినా అంతగా సినిమాలు రాలేదు రాశికి.

రీసెంట్​గా రాశి బరువు తగ్గి స్లిమ్ గా అయింది. అంతేకాదు పోలీస్​ ఆఫీసర్​ గెటప్​తో ఓ సినిమాలో ఎంట్రీ కూడా ఇస్తోందట. నాలుగు పదుల వయసులోనూ రాశి అందం పరంగా ఏమాత్రం తగ్గలేదు. అదే క్యూట్ నెస్ తో రాశి ఆకట్టుకుంటుంది అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. రాశి న్యూ లుక్ తో ఆమె అభిమానులు ఫిదా అవుతున్నారు. ప్రస్తుతం రాశి ఒక సినిమాలో పోలీస్ ఆఫీసర్ గా నటిస్తుంది. అందుకు సంబంధించిన సీన్స్ చిత్రీకరణ జరుగుతున్నాయి. ముందు ముందు రాశి పవర్ ఫుల్ పాత్రలతో బిజీ బిజీ అయ్యే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల టాక్. ఇదే ఫిజిక్ ను మెయింటెన్ చేస్తే రాశి మరో పదేళ్ల పాటు చేతినిండా ఆఫర్లతో వరుసగా చిత్రాలు చేయొచ్చంటూ సినీవిశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.