Breaking News

యుద్ధ నౌక‌ల్లో మ‌హిళ‌లు

యుద్ధ నౌక‌ల్లో మ‌హిళ‌లు
  • తొలి మ‌హిళా అధికారులుగా త్యాగి, రితిసింగ్ నియామ‌కం

న్యూఢిల్లీ : భార‌త నౌకాద‌ళంలో సోమ‌వారం అపూర్వ ఘ‌ట్టం ఆవిష్కృత‌మైంది. రక్షణ రంగంలో లింగ స‌మాన‌త్వానికి పున‌ర్​నిర్వచనం చెబుతూ.. నౌకాద‌ళంలోకి ఇద్దరు మ‌హిళా అధికారులు అడుగుపెట్టనున్నారు. యుద్ధనౌక‌ల్లో ప‌నిచేసేందుకు కుముదిని త్యాగి, రితిసింగ్‌లు నియ‌మితుల‌య్యారు. వీరిరువురు నౌకాద‌ళంలో స‌బ్ లెఫ్ట్‌నెంట్ హోదాలో ప‌నిచేస్తున్నారు. నేవీలో ఎంతోమంది మ‌హిళా అధికారులు ఉన్నా.. యుద్ధనౌక‌ల్లో వీరిని నియ‌మించ‌డం ఇదే ప్రథమం. ఎక్కువ కాలం ప‌నిచేయాల్సి రావ‌డం, సిబ్బంది క్వారంటైల్​లో టాయిలెట్‌, బాత్​రూమ్​ల కొర‌త‌, ప్రైవ‌సీ ఇబ్బందుల నేప‌థ్యంలో ఇంత‌కాలం నేవీలో మ‌హిళా అధికారుల‌ను నియ‌మించ‌లేదు. కాగా.. త్యాగి, రితిసింగ్‌ నేవీలో నిర్వహించే వివిధ అంశాల్లో శిక్షణ పొందారు. నౌకాద‌ళం అమ్ముల‌పొదిలో ఉన్న అత్యాధునిక ఎంహెచ్‌-60 ఆర్‌ లో వీరు విధులు నిర్వహించనున్నట్లు సమాచారం.