Breaking News

బండ్ల గణేశ్​కు కరోనా

సారథిన్యూస్​, హైదరాబాద్​: ప్రముఖ నటుడు, నిర్మాత బండ్ల గణేశ్ కు కరోనా పాజిటివ్​గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే మీడియాకు చెప్పారు. బండ్ల గణేశ్​కు కరోనా సోకినట్టు గత రెండు, మూడు రోజులుగా సామాజిక మాధ్యమాల్లో వార్తలు గుప్పుమన్నాయి. దీంతో మీడియా ప్రతినిధులు శనివారం ఆయనను సంప్రదించగా తనకు కరోనా సోకినట్టు ధ్రువీకరించారు. ప్రస్తుతం హోం క్వారైంటైన్​ లో ఉన్నానని ఆయన చెప్పారు. త్వరలో అపోలో లేదా కాంటినెంటల్​ హాస్పిటల్​లో చేరనున్నట్టు తెలిపారు. ఇటీవల బండ్ల గణేశ్ హెయిర్ ప్లాంటేషన్ నిమిత్తం ఓ దవాఖానకు వెళ్లగా, అనారోగ్య లక్షణాలను చూసిన అక్కడి డాక్టర్ కరోనా టెస్ట్ కు రిఫర్ చేశారట. ఆ వెంటనే బండ్ల గణేశ్ కరోనా పరీక్షలు చేయించుకోగా, పాజిటివ్ గా తేలింది. బండ్ల గణేశ్​కు కరోనా రావడంతో తెలుగు చిత్రపరిశ్రమ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఇటీవల ఆయనను కలిసినవారంతా హోం క్వారైంటైన్​కు వెళ్లారు.