Breaking News

పాస్ ఉంటేనే ఏపీలోకి..

పాస్ ఉంటేనే ఏపీలోకి..

సారథి న్యూస్, నల్లగొండ: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా సరుకు రవాణా, అత్యవసర సేవల వాహనాలు మినహా మిగిలిన అన్ని ప్రైవేట్ వెహికిల్స్​ల్లో ప్రయాణించే వారికి విధిగా పాస్ ఉండాలని, పాస్ లేకుండా ప్రయాణాన్ని అనుమతించబోమని నల్లగొండ జిల్లా ఎస్పీ రంగనాధ్ సూచించారు. ఆదివారం పలు ఆదేశాలను వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ వెళ్లాలనే ప్రయాణికులకు ఇకపై ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఏడు గంటల వరకు మాత్రమే అనుమతిస్తామని స్పష్టంచేశారు. నల్లగొండ జిల్లా మీదుగా మాచర్లకు వెళ్లే మార్గంలో ఉన్న నాగార్జున సాగర్ – మాచర్ల రోడ్డును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇంటిగ్రేటెడ్ రోడ్డుగా గుర్తించనందున ఆ మార్గంలో ఎలాంటి ప్రజా రవాణా, వాహనాలను ఏపీ పోలీసులు అనుమతించడం లేదని, ఈ విషయాన్ని ప్రయాణికులు గమనించాలని కోరారు.