Breaking News

నాన్న.. లంచం ఒప్పుకోలేదు

నాన్న.. లంచం ఒప్పుకోలేదు

టీమిండియా కెప్టెన్​ విరాట్​కోహ్లీ

తన కెరీర్‌ ఆరంభంలో స్టేట్‌ క్రికెట్‌కు ఎంపిక చేయడానికి క్రికెట్‌ అధికారులు లంచం అడిగారని కోహ్లీ తనకు చిన్నప్పుడు ఎదురైన చేదు ఘటనను గుర్తు చేసుకున్నాడు. అయితే తన తండ్రి ప్రేమ్‌ కోహ్లీ లంచం ఇవ్వడానికి ఒప్పుకోలేదని వెల్లడించాడు. ‘స్టేట్‌ క్రికెట్‌కు ఆడడానికి ఓ కోచ్‌ లంచం అడిగాడు. కానీ మా నాన్న ఇవ్వలేదు. నీవు మెరిట్‌తో ఆడగలిగితేనే క్రికెట్‌లో కొనసాగిస్తా. లేదంటే ఆడించను’ అని నాతో చెప్పాడు. ‘దీంతో నేను సెలెక్ట్‌ కాలేదు. అప్పుడు చాలా బాధపడ్డాను. అయినా ఈ ఘటన నాకు పెద్ద గుణపాఠం నేర్పింది. వరల్డ్‌ మొత్తం ఇలానే ఉంటుందనే భావన కలిగింది. మనం క్రికెట్‌లో రాణించాలంటే అందుకు తగ్గట్లుగా కష్టపడాలి. అందరూ వెళ్లే రూట్‌లో కాకుండా భిన్నంగా ప్రయత్నించాలని అర్థమైంది. లైఫ్‌లో పైకి రావాలంటే కష్టపడడం ఒక్కటే మార్గమని మా నాన్న నేర్పిన పాఠాన్ని ఇప్పటికీ వదిలిపెట్టలేదు. మా ఫాదర్‌ చేతలతోనే నన్ను సరైన మార్గంలో నడిపించాడు’ అని కెప్టెన్‌ వ్యాఖ్యానించాడు. చిన్నప్పటి నుంచి తన ఫాదర్‌ ఎన్నో కష్టాలు పడి చాలా ఉన్నతస్థాయికి చేరుకున్నాడని చెప్పాడు. అందుకే లంచం, అవినీతి అంటే ఆయనకు గిట్టవని తెలిపాడు.


నేను గెలిపించేవాడిని..
చిన్నతనంలో ఇండియా మ్యాచ్‌లు చూసినప్పుడు తన ఆలోచనలు భిన్నంగా ఉండేవని కోహ్లీ చెప్పాడు. ఇండియా ఓడిపోయినా తాను గెలిపించినట్లు ఊహించుకోని నిద్రపోయేవాడినని తెలిపాడు. ‘380 లక్ష్యాన్ని ఛేదించినా నాకు పెద్దగా ఉత్సాహం ఉండదు. ఎందుకంటే చిన్నప్పట్నించి ప్రతి మ్యాచ్‌ గెలవాలనే కోరుకునేవాడిని. 2011 హోబర్ట్​లో 40 ఓవర్లలోనే 340 ఛేదించాం. మన బ్యాటింగ్ తీరు 20 ఓవర్ల మ్యాచ్​ లాగా ఉండాలని విరామంలో రైనాకు చెప్పా. అదేస్థాయిలో ఆడాం. 40 ఓవర్లు అంటే ఎక్కువ సమయం పడుతుంది. అందుకే తొలి 20 ఓవర్లలో ఎన్ని పరుగులు చేస్తామో చూసి తర్వాతి 20 ఓవర్లను ఆడదామని చెప్పా’ అని విరాట్‌ వ్యాఖ్యానించాడు.