కరాచీ: కరోనా పాజిటివ్ వచ్చిన పది మంది క్రికెటర్లను పక్కనబెట్టి.. మిగతా ఆటగాళ్లతో పాకిస్థాన్ జట్టు.. ఇంగ్లండ్‌లోని మాంచెస్టర్‌కు చేరుకుంది. 20 మంది ఆటగాళ్లతో పాటు 11 మంది సహాయక సిబ్బంది ఈ బృందంలో ఉన్నారు.14 రోజుల క్వారంటైన్ తర్వాత వామప్ మ్యాచ్‌లో బరిలోకి దిగనుంది. ‘మరో చారిత్రాత్మక పర్యటనకు వెళ్తున్నాం. ఇంగ్లండ్‌లో ఆడటం ఎప్పుడూ గొప్పగానే ఉంటుంది’ అని బాబర్ ఆజమ్ ట్వీట్ చేశాడు. సహచరులతో కలిసి విమానంలో ప్రయాణిస్తున్న ఫొటోను ఉంచాడు. మూడు టెస్టులు, మూడు టీ20ల సీరిస్‌ను పూర్తిగా బయో సెక్యూర్ వాతావరణంతో పాటు, ఖాళీ స్టేడియాల్లో నిర్వహించేందుకు ఇంగ్లండ్ బోర్డు సన్నాహలు చేస్తున్నది. పాజిటివ్ వచ్చిన ఆటగాళ్లు పూర్తిగా కోలుకున్న తర్వాత జట్టుతో కలుస్తారని పీసీబీ వెల్లడించింది.
- June 29, 2020
- Archive
- Top News
- క్రీడలు
- CRIKETERS
- ENGLAND
- PAKISTHAN
- QUARANTINE
- TEAM
- ఇంగ్లండ్
- బయో సెక్యూర్
- Comments Off on ఇంగ్లండ్‌కు పాక్ జట్టు