Breaking News

‘అర్జున’కు ప్రణయ్ : గోపీచంద్

న్యూఢిల్లీ: భారత బ్యాడ్మింటన్ సంఘం(బాయ్)పై విమర్శలు గుప్పించిన స్టార్ ప్లేయర్ హెచ్ఎస్ ప్రణయ్ పేరును ‘అర్జున’ అవార్డుకు చీఫ్ కోచ్ గోపీచంద్ సిఫారసు చేశాడు. ఖేల్​రత్న హోదాలో అతడి పేరును ప్రతిపాదించినట్లు సమాచారం. ఈ నెల 3న ప్రణయ్ పేరును సిఫారసు చేసినా ఆలస్యంగా ఈ విషయంలో వెలుగులోకి వచ్చింది. సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి, సమీర్ వర్మ పేర్లను బాయ్ ఇప్పటికే అర్జునకు సిఫారసు చేసింది. అయితే తనను పట్టించుకోలేదన్న కోపంతో ప్రణయ్.. బాయ్​ పై తీవ్రమైన విమర్శలు చేశాడు. దీంతో క్రమశిక్షణ ఉల్లంఘన కింద ప్రణయ్​కు బాయ్ షోకాజ్ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే.