Breaking News

వారెవ్వా… పోలీస్​!

వారెవ్వా... పోలీస్​!

  • కానిస్టేబుళ్ల సస్పెన్షన్ లో వెలుగు చూసిన కొత్తకోణం
  • తప్పుడు పేర్లతో మరో పోలీస్​ అడ్డగోలు దందాలు
  • ప్రైవేట్ వ్యక్తిని అడ్డం పెట్టుకుని లావాదేవీలు
  • నాగర్ కర్నూల్ పీఎస్ లో రాము లీలలెన్నో
  • రాము కుట్రలకు కానిస్టేబుల్ చిన్నా బలి

సామాజికసారథి, నాగర్ కర్నూల్: నాగర్ కర్నూల్ పోలీస్ స్టేషన్ పరిధిలో పెట్రోలింగ్ కానిస్టేబుళ్ల బ్లాక్ మెయిల్ దందాలో ఇద్దరు కానిస్టేబుళ్ల సస్పెన్షన్ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. ఓ రక్షకభటుడు ఓ దొంగ.. మరోసారి పోలీస్​ అవతారమెత్తడం పలువురి విస్తుగొల్పింది. ఈ ఉదంతంలో తాజాగా గురువారం మరో కొత్తకోణం వెలుగుచూసింది. ఓ వ్యక్తి తనకు పరిచయం ఉన్న మరొకరి తో ఉండడాన్ని కానిస్టేబుళ్లు ఫొటోలు తీసి బ్లాక్ మెయిల్ చేసిన సంఘటనలో జిల్లా పోలీసు ఉన్నతాధికారులు ఇద్దరు కానిస్టేబుళ్లు, చిన్నా, రాంచందర్ ను సస్పెన్షన్ చేసిన విషయం తెలిసిందే. కానీ ఈ సంఘటనకు ఎలాంటి సంబందం లేకున్నా చిన్నా అనే కానిస్టేబుల్ కు సస్పెన్షన్ ఆర్డర్ రావడంతో విస్తుపోయాడు. తనకు ఎలాంటి సంబంధం లేదని చెప్పడంతో కొంచెం లోతుగా వెళ్లడంతో అసలు కథ వెలుగులోకి వచ్చింది. పోలీస్ శాఖకే మచ్చ తెచ్చేలా తన పేరు చెప్పకుండా మరొక కానిస్టేబుల్ పేరు చెప్పుకోవడమే కాదు.. వసూళ్ల కోసం ఓ ప్రైవేట్ వ్యక్తిని ఏర్పాటు చేసుకుని దర్జాగా అందిన కాడికి వసూళ్లు చేసుకున్న విషయం వెలుగులోకి వచ్చింది. నాగర్ కర్నూల్ పట్టణ పీఎస్ లో పనిచేస్తున్న రాము బ్లూకోర్ట్స్, పెట్రోలింగ్ డ్యూటీ పేరుతో ఎన్నో చోట్ల ఫొటోలు తీయడం, వారిని బెదిరించి డబ్బులు వసూలు చేసిన విషయం ప్రస్తుత సంఘటనతో బయటికి వచ్చింది. ఈ ఘటనలో కానిస్టేబుల్ రాము ఓ వ్యక్తి ఇంకొకరు ఉన్న ఫొటోలు తీసి బెదిరింపులకు దిగాడు. అంతేకాకుండా తన పేరు కానిస్టేబుల్​ చిన్నా అని తప్పుడు పేరు చెప్పుకున్నాడు. ఫొటోలు డిలిట్ చేయాలంటే తాను చెప్పిన నెంబర్ కు ఫోన్ పే ద్వారా డబ్బులు వేస్తే నీ ఫోటో తీసి వేస్తానని చెప్పాడు. దీని కోసం ఏకంగా శ్రీను నాయక్ అనే ఓ ప్రైవేట్ వ్యక్తి ఫోన్ నెంబర్( 9912061997) ఇచ్చి డబ్బులు వేయమని బెదిరించాడు. దీంతో చేసేదేమీ లేక ఆ బాధిత వ్యక్తి శ్రీను నాయక్ అనే ప్రైవేట్ వ్యక్తి ఫోన్ కు రూ.2వేలు ఫోన్ పే ద్వారా జూన్ 17న 2: 57 గంటలకు చెల్లించాడు. రాము మళ్లీ శ్రీను నాయక్ ఫోన్ ఫై నుంచి 3:22 గంటలకు రాములు రూ.2వేలు తిరిగి కొట్టించుకున్నాడు. కానీ కానిస్టేబుల్ రాము మాత్రం తీసిన ఫొటో ను డిలిట్ చేయకుండా తన తోటి కానిస్టేబుల్ రాంచందర్ కు ఆ ఫొటోను పంపించాడు. ఇలా రాము ఎన్నో ఫొటోలు తీయడం ప్రైవేట్ వ్యక్తి శ్రీనునాయక్ ఫోన్ కు ఫోన్ ఫే ద్వారా డబ్బులు వేయించుకుని దందాలు చేయడం బయటపడింది. ఎక్కడా కూడా తన నిజమైన పేరు ను చెప్పకుండా, డబ్బుల కోసం కూడా తన ఫోన్ నెంబర్ ఇవ్వకుండా జాగ్రత్తలు తీసుకొని ఎంతో కాలంగా దందాలు చేస్తున్నా పోలీస్ ఉన్నతాధికారులు కూడా గమనించలేదు.

చిన్నా సస్పెన్షన్ తో..!
రాము తన పేరును కాకుండా చిన్నా అని మరో కానిస్టేబుల్ పేరు చెప్పడంతో ఇటీవల జరిగిన సంఘటనలో విచారణ చేసిన పోలీసులకు బాధితులు కానిస్టేబుల్ చిన్నా అని చెప్పారు. దీంతో పూర్తి స్థాయిలో పోలీసులు విచారణ చేస్తునప్పుడు రాము అక్కడే ఉండి కానిస్టేబుల్ చిన్నా పేరు ఫై విచారణ చేస్తున్న పోలీస్ స్టేషన్ లో నే గమనిస్తూ ఉండటం అధికారులు గమనించలేకపోయారు. చిన్నా, రాంచందర్ పేర్లతో సస్పెన్షన్ ఆర్డర్లు జారీ చేశారు. తనకు ఎలాంటి సంబంధం లేదని చిన్నా అనే కానిస్టేబుల్ చెప్పడంతో అసలు కథ బయటికి వచ్చింది. ఇప్పటికైనా రాము, అతనికి సహకరిస్తున్న ప్రైవేట్ వ్యక్తి శ్రీను నాయక్ ల బ్యాంక్ స్టేట్ మెంట్లను క్షుణ్ణంగా పరిశీలించి, సమగ్ర విచారణ చేస్తే ఈయన అవినీతి దందా మరింత బయటికి వచ్చే అవకాశం ఉంది. ఓ వైపు తప్పుడు పనులు చేయడమే కాకుండా తన పేరును చెప్పకుండా ఇతర కానిస్టేబుళ్ల పేర్లను చెబుతూ ఇంకా ఎన్ని దందాలు చేశాడో జిల్లా పోలీస్ ఉన్నతాధికారులు విచారణ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎలాంటి సంబంధం లేకున్నా కాని స్టేబుల్ చిన్నా సస్పెన్షన్ ఆర్డర్ ను ఎత్తివేసి అసలు నిందితుడు రాముపై చర్యలు తీసుకోవాలని మండల ప్రజలు కోరుతున్నారు.

వారెవ్వా... పోలీస్​!
వారెవ్వా… పోలీస్​!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *