Breaking News

VAJEDU

సంబురంగా ఆదివాసీ దినోత్సవం

సంబురంగా ఆదివాసీ దినోత్సవం

సారథి న్యూస్, వాజేడు: ములుగు జిల్లా వాజేడు మండలంలో సోమవారం ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించినట్లు తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి దబ్బకట్ల లక్ష్మయ్య తెలిపారు. కరోనా సమయంలో కూడా పండుగను ఐక్యంగా జరుపుకోవడం శుభపరిణామమని అన్నారు. మండలంలో వాజేడు, పేనుగోల్ కాలనీ, మండపాక, గణపురం, గుమ్మడిదొడ్డి, చీపురుపల్లి, చెరుకూరు, పేరూరు, కృష్ణాపురం, కొంగాల, ముత్తారం, శ్రీరామ్ నగర్ గ్రామాల్లో జెండాలు ఎగరవేశామని తెలిపారు. ఆదివాసి అమరవీరుల త్యాగాలు, పోరాట ఫలితంగా ప్రపంచంలోని […]

Read More
స్వేరోసర్కిల్ ప్రధాన కార్యదర్శిగా వెంకటేశ్వర్లు

స్వేరోసర్కిల్ ప్రధాన కార్యదర్శిగా వెంకటేశ్వర్లు

సారథి న్యూస్, వాజేడు(ములుగు): ములుగు జిల్లా స్వేరో సర్కిల్ ప్రధాన కార్యదర్శిగా వాజేడు మండలానికి చెందిన వాసం వెంకటేశ్వర్లు గురువారం నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామాల్లో ఉన్న విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దుతామన్నారు. డాక్టర్​ బీఆర్​ అంబేద్కర్ అడుగుజాడల్లో ప్రతి ఒక్కరూ నడవాలన్నారు. గ్రామాల్లో ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల యువతను ఉన్నతస్థాయికి చేర్చుతామన్నారు.

Read More
కొంగాలలో హెల్త్ క్యాంప్

కొంగాలలో హెల్త్ క్యాంప్

సారథి న్యూస్, వాజేడు: ములుగు జిల్లా వాజేడు మండలం కొంగల గ్రామంలో గురువారం హెల్త్ క్యాంప్ నిర్వహించారు. వర్షాకాలంలో వచ్చే వ్యాధులు, తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. అందరూ కచ్చితంగా మాస్కులు కట్టుకోవాలని, సామాజిక దూరం పాటించాలని డాక్టర్లు సూచించారు. బీపీ, షుగరు, టీబీ ఉన్నవారు, 60 ఏళ్లు పైబడిన అందరూ జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో డాక్టర్ యమున, కోటిరెడ్డి, ఛాయాదేవి, ఆశావర్కర్లు, 104 వాహన సిబ్బంది పాల్గొన్నారు.

Read More
ఉత్సాహంగా హరితహారం

ఉత్సాహంగా హరితహారం

సారథి న్యూస్, వాజేడు: ములుగు జిల్లా వెంకటాపురం మండలం సీఆర్పీఎఫ్ 141వ బెటాలియన్ కమాండెంట్ శ్రీహరిఓం ఖరే ఆధ్వర్యంలో ఆదివారం వెంకటాపురం మండలంలోని మంగవాయ, లక్మిపురం, పాత్రపురం గ్రామాల్లో 6వ విడత హరితహారం కార్యక్రమాన్ని ఉత్సాహంగా నిర్వహించారు. సీఆర్​పీఎఫ్​ఆఫీసర్ కమాండింగ్ ఎస్సై సీతారాం సింగ్, సీఐ శివప్రసాద్, ఎస్సై తిరుపతి, సీఆర్​పీఎఫ్​ఎస్సై అలెగ్జాండర్ డేవిడ్, ఎస్సై రాంప్రసాద్ పాల్ మొక్కలు నాటారు. హరితహారం కార్యక్రమం ప్రాధాన్యతను వివరించారు. సర్పంచ్ కృష్ణార్జునరావు, ఉపసర్పంచ్ మల్లికార్జున రావు, టీచర్ పాండా […]

Read More
గేదెలను ఢీకొట్టిన ట్రావెల్స్​బస్సు

గేదెలను ఢీకొట్టిన ట్రావెల్స్​ బస్సు

సారథి న్యూస్, వాజేడు: ములుగు జిల్లా వాజేడు మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. శుక్రవారం సాయంత్రం కలకత్తా నుంచి హైదరాబాద్ కు ఛత్తీస్ గఢ్ మీదుగా వెళ్తున్న ట్రావెల్స్​ బస్సు వాజేడు మండలం గుమ్మడిదొడ్డి గ్రామం వద్ద పాడి గేదెలను ఢీకొట్టింది. ఈ ఘటనలో మూడు గేదెలు మృతిచెందాయి. డ్రైవర్, క్లీనర్​పరారీలో ఉన్నారు.

Read More

మాస్కులు పంపిణీ

సారథి న్యూస్, వాజేడు(ములుగు): వాజేడు మండలం బాలలక్ష్మీపురం గ్రామంలో ఎస్సై తిరుపతిరావు బుధవారం మాస్కులు పంపిణీ చేశారు. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించడమే కాకుండా భౌతికదూరం పాటించాలని, వ్యక్తిగత శుభ్రత పాటించాలని సూచించారు. గ్రామంలో ఎవరికైనా దగ్గు, జ్వరం, శ్యాసతీసుకోడం ఇబ్బందులు కలిగితే వెంటనే వైద్యులను సంప్రదించాలని గ్రామస్తులకు సూచించారు.

Read More