Breaking News

PEDDASHANKARAMPET

ఆసక్తిగా సాగిన పంచాంగ పఠనం

ఆసక్తిగా సాగిన పంచాంగ పఠనం

వైభవంగా ఉగాది వేడుకలు సామాజికసారథి, పెద్దశంకరంపేట: పెద్దశంకరంపేటతో పాటు మండలంలోని ఆయా గ్రామాల్లో శుభకృత్​నామ ఉగాది ఉత్సవాలను శనివారం ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. పేటలోని రామాలయంలో ఎంపీపీ జoగం శ్రీనివాస్, సర్పంచ్ అలుగుల సత్యనారాయణ, గ్రామ ప్రజలు ప్రత్యేకపూజలు నిర్వహించారు. అనంతరం వేద బ్రాహ్మణ పండితులు మహేశ్​శర్మ పంచాంగ శ్రవణం పాటించగా ప్రజాప్రతినిధులు, గ్రామపెద్దలు, గ్రామస్తులు, అధికసంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ బాధ్యులు, గ్రామపెద్దలు గుజ్జరి కనకరాజు, కందుకూరి రవీందర్, మురళి పంతులు, సుభాష్ గౌడ్, […]

Read More
శాంతియుతంగా వినాయక ఉత్సవాలు

శాంతియుతంగా వినాయక ఉత్సవాలు

సామాజిక సారథి, పెద్దశంకరంపేట: ప్రజలంతా శాంతియుత వాతావరణంలో వినాయక ఉత్సవాలను జరుపుకోవాలని పెద్దశంకరంపేట ఎస్సై నరేందర్ అన్నారు. ఆదివారం పెద్దశంకరంపేట  పోలీస్ స్టేషన్ లో ఎంపీపీ జంగం శ్రీనివాస్ అధ్యక్షతన అన్ని గ్రామాల ప్రజాప్రతినిధులు గణేష్ మండపాల నిర్వాహకులతో నిర్వహించిన శాంతి సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈనెల 10న వినాయకచవితి పండుగను పురస్కరించుకుని తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వివరించారు. వినాయక నవరాత్రి ఉత్సవాలు ముగిసే వరకు ప్రశాంత వాతావరణంలో పండుగలు జరుపుకోవాలని, అందుకు నిర్వాహకులు పోలీసులకు సహకరించాలని కోరారు. […]

Read More
పెండింగ్ చలాన్ల పరిశీలన

పెండింగ్ చలాన్ల పరిశీలన

సారథి, పెద్దశంకరంపేట: మెదక్​ జిల్లా నాందేడ్– అకోలా హైవేపై పెద్దశంకరంపేట అంబేద్కర్ చౌరస్తాలో బుధవారం పోలీసులు వాహనాలను తనిఖీ చేశారు. ట్రెయినీ ఎస్సై దీక్షిత్ రెడ్డి ఆధ్వర్యంలో వాహనాల పెండింగ్​ చలాన్లను పరిశీలించారు. ప్రతిఒక్కరూ వాహనం నడిపేటప్పుడు ధ్రువీకరణ పత్రాలు, డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలన్నారు. వారి వెంట పోలీస్​ సిబ్బంది ఉన్నారు.

Read More
అట్టహాసంగా తల్లిపాల వారోత్సవాలు

అట్టహాసంగా తల్లిపాల వారోత్సవాలు

సారథి, పెద్దశంకరంపేట: మెదక్​ జిల్లా పెద్దశంకరంపేటలోని 9వ నంబర్ అంగన్​వాడీ కేంద్రంతో పాటు తిరుమలాపూర్ సెంటర్ ఆధ్వర్యంలో తల్లిపాల వారోత్సవాలను బుధవారం అట్టహాసంగా నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన పబ్లిక్ హెల్త్ నర్సు సంపూర్ణ మాట్లాడుతూ.. పుట్టినబిడ్డకు తల్లిపాలే శ్రేష్టమని అన్నారు. ముర్రుపాలతో బిడ్డలో రోగనిరోధక శక్తి పెరిగి ఆరోగ్యవంతంగా ఉంటాడని ఆమె అవగాహన కల్పించారు. అనంతరం గర్భిణులు, బాలింతలతో పాటు విద్యార్థుల తల్లిదండ్రులతో ర్యాలీ నిర్వహించి తల్లిపాల ఆవశ్యకతను వివరించారు. ఈ సందర్భంగా పలువురు మహిళలకు వైద్యారోగ్య […]

Read More
భవిత కేంద్రంలో తనిఖీ

భవిత కేంద్రంలో తనిఖీ

సారథి, పెద్దశంకరంపేట: పెద్దశంకరంపేట మండల కేంద్రంలోని భవిత కేంద్రాన్ని జిల్లా సెక్టరియల్ అధికారి ఆర్.సూర్యప్రకాష్ శుక్రవారం సందర్శించి పలు రికార్డులను పరిశీలించారు. మండల ఐఈఆర్ డీ సమన్వయకర్తకు పలు సూచనలు చేశారు. మండలంలోని ప్రత్యేక అవసరాలు ఉన్న విద్యార్థుల సంఖ్య, వారికి అవసరమైన సదుపాయాలు, వారికి ఉన్న వనరులను ప్రత్యేకంగా మండల సమన్వయకర్తకు వివరించారు. ఆ దిశగా ప్రభుత్వం ప్రత్యేకావసరాలు కలిగిన పిల్లలకు కల్పిస్తున్న సౌకర్యాలు ప్రతి పిల్లవాడికి చేరేలా కృషిచేయాలని సూచించారు. టెలీసర్వీస్ ప్రతిరోజు పిల్లవాడికి […]

Read More
దళితులపై బీజేపీ చిన్నచూపు

‘దళితులపై బీజేపీ చిన్నచూపు’

సారథి,పెద్దశంకరంపేట: దళితులను బీజేపీ, ఆ పార్టీ ఎమ్మెల్యే, నాయకులు చిన్నచూపు చూస్తున్నారని మెదక్​జిల్లా పెద్దశంకరంపేట ఎంపీపీ జంగం శ్రీనివాస్ అన్నారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. దుబ్బాక నియోజకవర్గంలోని నార్సింగ్ మండలం వల్లూరు గ్రామ దళిత సర్పంచ్ మహేశ్వరి నరేష్​ను ఎమ్మెల్యే రఘునందన్ రావు అవమానించడం, దళితుల పట్ల ఆయనకు ఉన్న చిన్నచూపు, బీజేపీకి ఉన్న చిత్తశుద్ధి అర్థమవుతుందన్నారు. ఎంపీపీ, సర్పంచ్​కు చెప్పకుండా గ్రామపంచాయతీ భవనాన్ని ప్రారంభోత్సవం చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.

Read More
వెదజల్లే పద్ధతిలో అధిక లాభాలు

వెదజల్లే పద్ధతిలో అధిక లాభాలు

సారథి, పెద్దశంకరంపేట: వరి పంట సాగులో వెదజల్లే పద్ధతి ద్వారా అధిక దిగుబడి సాధించవని మెదక్​జిల్లా పెద్దశంకరంపేట మండల వ్యవసాయాధికారి అమృత అన్నారు. గురువారం మండలంలోని ఉత్తులూర్ శివారులో డ్రమ్​సీడర్ ద్వారా వరిసాగులో వెదజల్లే పద్ధతిలో విత్తనాలు వేశారు. ఈ పద్ధతిని రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. ఆయన వెంట ఏఈవో రాజు, పలువురు రైతులు ఉన్నారు.

Read More
భూకబ్జాల చరిత్ర మీదే

భూకబ్జాల చరిత్ర మీదే

సారథి, పెద్దశంకరంపేట: మెదక్​ జిల్లా పెద్దశంకరంపేటకు చెందిన రంగరి పండరినాథ్ మృతి విషయంలో జహీరాబాద్ మాజీ ఎంపీ సురేష్ షెట్కార్, మాజీ ఎంపీపీ సంజీవరెడ్డి తనపై చేసిన ఆరోపణలు సరికాదని ఎంపీపీ జంగం శ్రీనివాస్ హితవు పలికారు. బుధవారం పెద్దశంకరంపేటలోని తన నివాసంలో టీఆర్ఎస్ నాయకులతో కలిసి విలేకరులతో మాట్లాడారు. పండరినాథ్ మృతి కేసు కోర్టు ఎప్పుడో కొట్టివేసిందని, అవసరమైతే పైకోర్టుల్లో అప్పీలు చేసుకోవచ్చన్నారు. చట్టాలు ఎవరికీ చుట్టం కాదని పేర్కొన్నారు. కేసు విషయంలో పూర్తివివరాలు తెలుసుకొని […]

Read More