సారథి, బిజినేపల్లి: నాగర్కర్నూల్ జిల్లా వట్టెం జవహర్ నవోదయ విద్యాలయం 6వ తరగతిలో ప్రవేశానికి ఆగస్టు 11న ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు ఇన్చార్జ్ ప్రిన్సిపల్ బి.కవిత, ఎగ్జామ్ ఇన్చార్జ్ వి.భాస్కరాచారి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇదివరకే దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు www.navodaya.gov.in అనే వెబ్సైట్ నుంచి హాల్టికెట్ ను డౌన్లోడ్ చేసుకోవాలని కోరారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని 26 కేంద్రాల్లో ఎగ్జామ్నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. 6వ తరగతిలో ప్రవేశపరీక్ష రాసేందుకు 4,151 మంది విద్యార్థులు దరఖాస్తు […]
సారథి, చొప్పదండి: రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఐసోలేషన్ సెంటర్ ఏర్పాటుకు చొప్పదండి పట్టణంలోని నవోదయ విద్యాలయాన్ని అడిషనల్ కలెక్టర్ శ్యాంప్రసాద్ లాల్, డీపీవో వీరబుచ్చయ్య సోమవారం పరిశీలించారు. ఐసొలేషన్ ఏర్పాటునకు అన్నిరకాల వసతులు ఉన్నందున ఎంపిక చేసినట్లు తెలిపారు. తహసీల్దా్ర్ అంబటి రజిత, మున్సిపల్ కమిషనర్ అంజయ్య, వైద్యాధికారి రమాదేవికి నిర్వహణ బాధ్యతలను అప్పగించారు. పనులు వెంటనే ప్రారంభించేలా ఆదేశాలు జారీచేశారు. కార్యక్రమంలో నవోదయ విద్యాలయ ప్రిన్సిపల్ మంగతాయారు, ఎంపీవో జగన్మోహన్ రెడ్డి, రెవెన్యూ ఇన్ […]
సారథి న్యూస్, బిజినేపల్లి: నాగర్కర్నూల్ జిల్లా వట్టెం నవోదయ విద్యాలయంలో తెలుగు ఉపాధ్యాయుడు శేషం సుప్రసన్నాచార్యులుకు కర్ణాటకలోని విజయనగరం విరూపాక్ష స్వామి ఆలయ ప్రాంగణంలో ఆదివారం జరిగిన ప్రతిష్ఠాత్మక జాతీయ సంగీత నృత్య సాహిత్య కార్యక్రమంలో సిటిజన్ వెల్ఫేర్ అసోసియేషన్ వారు గౌరవ పురస్కారం ప్రదానం చేశారు. అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ కోలా వేంకటేశ్వర్రావు మాట్లాడుతూ.. సుప్రసన్నాచార్యులు బహుముఖ ప్రజ్ఞాశాలి తెలుగు సాహిత్యంలో విశేషకృషి చేశారని, పద్యకవిత వచనకవితా ప్రక్రియల్లో కవితారచన చేయడంలో సవ్యసాచి అని కొనియాడారు. […]
సారథి న్యూస్, బిజినేపల్లి: నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలంలోని వట్టెం నవోదయ విద్యాలయంలో 2020–21 అకాడమిక్ ఆరవ తరగతిలో చేరేందుకు విద్యార్థుల ప్రవేశపరీక్షకు శుక్రవారం నోటిఫికేషన్విడుదలైందని ప్రిన్సిపల్ వీరరాఘవయ్య తెలిపారు. ఆరవ తరగతిలో 80 సీట్లు ఉన్నాయని వెల్లడించారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా పరిధిలో ఐదవ తరగతి చదివిన విద్యార్థులు ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. కాగా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో జిల్లాకు ఒకటి చొప్పున నవోదయ విద్యాలయాలు ఉన్నాయి. సీబీఎస్ఈ బోధన ఉంటుంది. […]