సారథి న్యూస్, మహబూబ్నగర్: రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం ప్రతి గ్రామంలో రైతు వేదికలు నిర్వహించాలని నిర్ణయించిందని మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట్రావు చెప్పారు. క్షేత్రస్థాయి అధికారులంతా సమష్టి కృషితో వ్యవహరించి రెండు నెలల్లో ఈ రైతు వేదికల నిర్మాణాన్ని కంప్లీట్చేయాలని ఆదేశించారు. సోమవారం మహబూబ్ నగర్ జడ్పీ మీటింగ్హాల్లో నిర్వహించిన అధికారుల ఒక్కరోజు శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. మహబూబ్ నగర్ జిల్లాలో 88 రైతు వేదికలు నిర్మించేందుకు ప్రభుత్వం రూ.13.5 కోట్లు […]