Breaking News

ఆర్ఎస్ఎస్

సనాతన ధర్మరక్షణకు పాటుపడాలి

సనాతన ధర్మరక్షణకు పాటుపడాలి

ఆర్ఎస్ఎస్ మెదక్ విభాగ్ ప్రచార ప్రముఖ బండి వెంకటేశ్వర్లు సామాజిక సారథి, పెద్దశంకరంపేట: సనాతన భారతీయ సంస్కృతి సంప్రదాయాలను, ధర్మరక్షణ కోసం ప్రతిఒక్కరూ పాటుపడాలని ఆర్ఎస్ఎస్ మెదక్ విభాగ్ ప్రచార ప్రముఖ బండి వెంకటేశ్వర్లు అన్నారు. శనివారం పెద్దశంకరంపేటలోని శ్రీ సరస్వతి శిశుమందిర్ లో ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో ఉగాది ఉత్సవం నిర్వహించారు. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ వ్యవస్థాపకులు డాక్టర్ కేశవరావు బలిరాం పంత్ హెడ్గేవార్ జన్మదినాన్ని సైతం జరుపుకున్నారు. హిందూ సంఘటన ధ్యేయంగా రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ […]

Read More
సంఘటిత సమాజమే ధ్యేయం

సంఘటిత సమాజమే ధ్యేయం

ఆర్ఎస్ఎస్ సర్ కార్యవాహ దత్తాత్రేయ హోసబలే  సామాజిక సారథి, నల్లగొండ ప్రతినిధి: సంఘటిత, సమర్థ, స్వాభిమాన భారత్ ను రూపొందించడంలో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలని, ఇదే హిందూ శక్తి సంగమం సందేశమని ఆర్ఎస్ఎస్ సర్ కార్యవాహ దత్తత్రేయ హోసబలే పేర్కొన్నారు. నల్లగొండ జిల్లాకేంద్రంలోని ఎన్జీ కళాశాల మైదానంలో హిందూ శక్తి సంగమం పేరుతో శనివారం నిర్వహించిన జిల్లా మహాసాంఘిక్ సార్వజనికోత్సవంలో ఆయన పాల్గొని మాట్లాడారు. స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా అమృతోత్సవాలు నిర్వహించుకుంటున్నామని చెప్పారు. […]

Read More
ఊరూరా రక్షాబంధన్ వేడుకలు

ఊరూరా రక్షాబంధన్ వేడుకలు

సామాజిక సారథి, పెద్దశంకరంపేట: ప్రతి గ్రామంలో రక్షాబంధన్ కార్యక్రమం నిర్వహించేలా ఆర్ఎస్ఎస్ స్వయం సేవకులు, జనహిత ఏకోపాధ్యాయ పాఠశాల ఆచార్యులు, ఏర్పాట్లు చేసుకోవాలని జనహిత ఏకోపాధ్యాయ పాఠశాల మెదక్ జిల్లా ప్రముఖ పోచయ్య, పెద్దశంకరంపేట అఖండ ఆర్ఎస్ఎస్ కార్యవాహ జైహింద్ రెడ్డి, సహ కార్యవాహ సీతారామారావు కోరారు. బుధవారం పెద్దశంకరంపేట సరస్వతి శిశు మందిర్ లో ఆర్ఎస్ఎస్ బాధ్యులు, జనహిత ఏకోపాధ్యాయ పాఠశాల ఆచార్యల సమావేశం నిర్వహించారు. హిందూధార్మిక కార్యక్రమాలు, వరలక్ష్మీ వ్రతం, రక్షాబంధన్, గోకులాష్టమి, ఉత్సవాల […]

Read More
రాజన్న సన్నిధిలో ఆర్ఎస్ఎస్ ప్రముఖ్​

రాజన్న సన్నిధిలో ఆర్ఎస్ఎస్ ప్రముఖ్​

సారథి, వేములవాడ: దక్షిణకాశీగా పేరొందిన వేములవాడ పార్వతి రాజరాజేశ్వర స్వామివారి ఆలయాన్ని మంగళవారం రాష్టీయస్వయంసేవక్​సంఘ్ అఖిల భారతీయ గ్రామవికాస్ సహ ప్రముఖ గురురాజాజీ, పద్మారెడ్డి దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం నాగిరెడ్డి మండపంలో ఆలయఅర్చకులు, వేదపండితులు వేదోక్త ఆశీర్వచనం చేశారు. అనంతరం స్వామి వారి అభిషేకం లడ్డూ, తీర్థప్రసాదాలను వారికి అందజేశారు. వారి వెంట రాజన్న సిరిసిల్ల జిల్లా విశ్వహిందు పరిషత్ సహాయ కార్యదర్శి గడప కిషోర్ రావు, భజరంగ్ దళ్ ప్రముఖ్ యశ్వంత్ ఉన్నారు.

Read More
ఆర్ఎస్ఎస్​వాదులు కాంగ్రెస్ నుంచి వెళ్లిపోండి

ఆర్ఎస్ఎస్​వాదులు కాంగ్రెస్ నుంచి వెళ్లిపోండి

న్యూఢిల్లీ: రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్)​భావజాలం కలిగిన నేతలు ఎవరైనా కాంగ్రెస్ లో ఉంటే, అలాంటి నేతలు వెంటనే పార్టీ నుంచి వెళ్లిపోవాలని కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సూచించారు. శుక్రవారం జూమ్ ద్వారా నిర్వహించిన సోషల్ మీడియా విభాగం కార్యక్రమంలో రాహుల్ గాంధీ పాల్గొని కీలక ప్రసంగం చేశారు. సంఘ్ భావజాలం ఉన్న కాంగ్రెస్ నేతలకు తలుపులు తెరిచే ఉన్నాయని, ఏమాత్రం ఆలోచించకుండా పార్టీ నుంచి బయటికి వెళ్లిపోవచ్చన్నారు. ‘ఇక్కడ చాలా మంది […]

Read More
కరోనా బాధిత కుటుంబాలకు ఆర్థిక సాయం

కరోనా బాధిత కుటుంబాలకు ఆర్థిక సాయం

సారథి, పెద్దశంకరంపేట: ఇటీవల కరోనా బారినపడి ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న పలువురు ఆర్ఎస్ఎస్ నిరుపేద కార్యకర్తలు, కుటుంబ సభ్యులకు సేవాభారతి ఆధ్వర్యంలో మంగళవారం నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో పెద్దశంకరంపేట ఆర్ఎస్ఎస్ స్వయం సేవకులు సీతారామారావు, రవివర్మ, సతీష్ గౌడ్, జైహింద్ రెడ్డి, సర్వేశ్వర్, కృష్ణమూర్తి, విశ్వేశ్వర్ గౌడ్, శ్రీహరి, మధు, దుర్గాప్రసాద్ పాల్గొన్నారు.

Read More
మరికొద్ది గంటల్లో అయోధ్యలో మహాఘట్టం

మరికొద్ది గంటల్లో అయోధ్యలో మహాఘట్టం

న్యూఢిల్లీ: అయోధ్య మహాఘట్టానికి వేళయింది. ఆలయ నిర్మాణానికి బుధవారం మధ్యాహ్నం ప్రధాని మోడీ శంకుస్థాపన చేయనున్నారు. శ్రీరాముడి జన్మభూమి అయోధ్యలో బృహత్తర రామాలయం నిర్మాణానికి మరికొన్ని గంటల్లో భూమిపూజ మహోత్సవం జరగనుంది. ప్రధాని నరేంద్రమోడీ స్వయంగా గర్భగుడిలో 40 కిలోల వెండి ఇటుకలను ప్రతిష్ఠించి..నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. సంఘ్‌ అధినేత మోహన్‌ భగవత్‌ తదితరులు రానున్నారు. బీజేపీ అగ్రనేతలు ఎల్‌కే అద్వానీ, మురళీ మనోహర్‌ జోషి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా కార్యక్రమంలో పాల్గొంటారు.ఇదీ చరిత్రసరయూనది ఒడ్డున […]

Read More