సామాజిక సారథి, హలియా: ఉద్యమకారులపై రౌడీషీట్లను ఎత్తివేయాలని ఎమ్మెల్యే నోముల భగత్ హోంమంత్రి మహమూద్ అలీకి వినతిపత్రం సమర్పించారు. హైదరాబాద్ మంత్రి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమ సమయంలో ఉద్యమకారులపై పోలీసులు పెట్టిన రౌడీషీట్లను ఎత్తివేయాలని కోరుతూ తెలంగాణ రాష్ట్ర హోంమంత్రి కలిసి వినతిపత్రం అందజేశారు. మంత్రి సానుకూలంగా స్పందిస్తూ రౌడీషీట్లు ఎత్తివేసేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని భగత్ తెలిపారు. హోంమంత్రికి వినతి పత్రం సమర్పించేందుకు పలువురు ఉద్యమకారులు అభినందనలు తెలియజేశారు.
సారథి న్యూస్, సిద్దిపేట: సిద్దిపేట జిల్లా మర్కుక్ పోలీస్ స్టేషన్ ను హోంశాఖ మంత్రి మహమూద్‌అలీ, ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు శుక్రవారం ప్రారంభించారు. హోంమంత్రి మహమూద్ అలీ పోలీస్ అధికారుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. కార్యక్రమంలో డీజీపీ ఎం.మహేందర్ రెడ్డి, ఫారెస్ట్కార్పొరేషన్ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి, ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, కలెక్టర్ వెంకట్రామిరెడ్డి, పలువురు ఎమ్మెల్యేలు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
సారథిన్యూస్, హైదరాబాద్: భాగ్యనగరంలో కరోనా విలయతాండవం చేస్తున్నది. జీహెచ్ఎంసీ పరిధిలో పూర్తి లాక్డౌన్ చేసేందుకు ప్రభుత్వం సన్నద్ధం అవుతున్నది. కాగా తాజాగా తెలంగాణ హోంమంత్రి మహమూద్ అలీకి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో ఆయనను అపోలో ఆస్పత్రకి తరలించి చికిత్స అందిస్తున్నారు. డాక్టర్ల పర్యవేక్షణలో హోంమంత్రికి వైద్యం అందిస్తున్నారు. మరోవైపు పోలీసులు అప్రమత్తం అయ్యారు. హోంమంత్రితో తిరిగిన వారిని క్వారంటైన్‌కు పంపిస్తున్నారు. అలాగే హోంమంత్రి నివాసం ఉండే పరిసర ప్రాంతాల్లో మున్సిపల్ సిబ్బంది శానిటైజర్ చేస్తున్నారు. […]