జూన్ 12న సినారె వర్ధంతి ‘చేతగాని తనముంటే జాతకాన్ని నిందించకునమ్మలేని సరుకుంటే అమ్మకాన్ని నిందించకుకలం రాయలేకుంటే కాగితాన్ని నిందించకు..’మనిషిలోని చేతగానితనాన్ని ఎత్తిచూపారు సినారె.. విశ్వంభరుడు, మానవతా మహానీయుడు, ఆధునిక కవి, వక్త, సాహితీ పరిశోధకుడు, బహుభాషావేత్త, ప్రయోగశీలి, సుప్రసిద్ధ సినీగేయ రచయిత.. ఇలా ఎన్నో పేర్లతో పిలిచినా ఆయనకు తక్కువేనని చెప్పవచ్చు. ఆయనే మన సాహితీకోవిదుడు డాక్టర్ సింగిరెడ్డి నారాయణరెడ్డి. అందరికి సినారెగా సుపరిచితులు. నాటి ఉమ్మడి కరీంనగర్ జిల్లా, నేటి రాజన్న సిరిసిల్ల జిల్లా హనుమాజిపేట […]