కరోనా నేపథ్యంలో సర్కారు నిర్ణయం 16న ముగిసిన సంక్రాంతి హాలీ డేస్ మహమ్మారి వ్యాప్తి దృష్ట్యా విద్యాసంస్థలకు పొడిగింపు మెడికల్కాలేజీలకు మినహాయింపు సెలవులు రద్దుచేయాలని ఉపాధ్యాయ, ప్రైవేట్స్కూళ్ల యాజమాన్యాల డిమాండ్ పిల్లల చదువులపై పేరెంట్స్ఆందోళన సామాజికసారథి, హైదరాబాద్: రాష్ట్రంలోని విద్యాసంస్థలకు సెలవులను పొడిగించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. కొవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ మేరకు ఈ నిర్ణయం తీసుకున్నది. మెడికల్కాలేజీలకు మినహాయింపు ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 8వ తేదీ నుంచి ప్రకటించిన సంక్రాంతి సెలవులు 16వ […]
సామాజిసారథి, హైదరాబాద్: రేషన్ కార్డు దారులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. బియ్యం పంపిణీ చేసే గడువును ఐదు రోజులకు పెంచింది. ప్రతి నెల ఒకటో తేదీన రాష్ట్రవ్యాప్తంగా రేషన్ పంపిణీ ప్రారంభమవుతుంది. అలాగే రేషన్ పంపిణీ ప్రక్రియ 15 రోజుల పాటు కొనసాగుతుంది. మాములుగా అయితే అదే నెల 1వ తేదీన ప్రారంభమైన రేషన్ పంపిణీ ప్రక్రియ అదేనెల 15న ముగుస్తుంది. అయితే ఈ జనవరి మాసంలో కొన్ని అనివార్య కారణాల వల్ల రేషన్ […]
వెల్లడించిన ఎలక్షన్కమిషన్ ఓటరు జాబితా విడుదల న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఓటర్ల జాబితా 2022ను కేంద్ర ఎన్నికల సంఘం బుధవారం విడుదల చేసింది. ఓటర్ల జాబితా సవరణలో భాగంగా దాఖలైన దరఖాస్తులను పరిష్కరించిన కేంద్ర ఎన్నికల సంఘం అనంతరం ఓటర్ల ఫైనల్లిస్టును ప్రకటించింది. ఈ మేరకు తెలంగాణలో మొత్తం ఓటర్లు 3,03,56,894 మంది ఉన్నారని తెలిపింది. ఇందులో పురుష ఓటర్లు 1,52,56,474 మంది, మహిళా ఓటర్లు 1,50,98,685 మంది, ఇతర ఓటర్లు 1,735 మంది ఉన్నారని […]
కోల్కతా: కరోనా నయా వేరియంట్ ఒమిక్రాన్ దేశంలో శరవేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో పలు రాష్ట్రాలు ఇప్పటికే ఆంక్షలు అమలు చేస్తున్నాయి. జనం పెద్దఎత్తున గుమికూడడం, సభలు, సమావేశాలకు అనుమతి నిరాకరిస్తున్నాయి. కొన్ని రాష్ట్రాలు నైట్ కర్ఫ్యూ కూడా అమలు చేస్తున్నాయి. ఈ విషయంలో పశ్చిమ బెంగాల్ మరో అడుగు ముందుకేసింది. దాదాపు లాక్డౌన్ తరహా ఆంక్షలను ప్రకటించింది. స్కూళ్లు, కాలేజీలు, యూనివర్సిటీలు, స్పాలు, సెలూన్లు, బ్యూటీ పార్లర్లు, జూలు, వినోద పార్కులను జనవరి 3 నుంచి మూసివేస్తున్నట్లు […]
ఆర్చరీ టోర్నీ రాష్ట్రానికే గర్వకారణం మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ సామాజికసారథి, హైదరాబాద్: యువతలో క్రీడాస్ఫూర్తిని పెంపొందించేందుకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఎన్టీపీసీ వంటి సంస్థలు ఆర్చరీ (విలువిద్య) క్రీడలను నిర్వహించడానికి ముందుకు రావడం సంతోషించదగ్గ విషయమన్నారు. ఇలాంటి క్రీడలను ప్రోత్సహించడానికి ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుందని తెలిపారు. ఆదివారం గచ్చిబౌలి స్టేడియంలో మొదటి ఎన్టీపీసీ నేషనల్ ర్యాంకింగ్ ఆర్చరీ టోర్నమెంట్ జరిగింది. ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… […]
నేటినుంచి రైతుబంధు నిధులు విడుదల యాసంగి పెట్టుబడి కోసం ఖాతాల్లో జమ 66.61 లక్షల మంది రైతులకు రూ.7,645.66 కోట్లు సామాజికసారథి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది. రైతుబంధు సొమ్మును ఈనెల 28వ తేదీ నుంచి నుంచి రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయనుంది. యాసంగి పంట పెట్టుబడులకు సంబంధించి నిధులు పంపిణీ చేయనుంది. ఈ పథకం ప్రారంభమైనప్పటి నుంచి ఏడు విడతల్లో రూ.43,036.63 కోట్లు రైతుల ఖాతాల్లోకి జమచేశారు. ఈ సీజన్ […]
సామాజిక సారథి, హైదరాబాద్ప్రతినిధి: రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ గడువు గురువారం మధ్యాహ్నం 3 గంటలకు ముగిసింది. నాలుగు జిల్లాల్లో ఆరు స్థానాల ఎన్నిక ఏకగ్రీవం కాగా, ఐదు జిల్లాల్లో ఎన్నిక జరగనుంది. మొత్తం 12 స్థానాలకు నోటిఫికేషన్ వెలువడింది. ఇందులో ఆరు స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. మరో ఆరు స్థానాలకు డిసెంబర్ 10న పోలింగ్ నిర్వహించనున్నారు. నిజామాబాద్ జిల్లా స్థానిక సంస్థల నుంచి కల్వకుంట్ల కవిత, రంగారెడ్డి నుంచి పట్నం మహేందర్ రెడ్డి, […]