సామాజికసారథి, మహబూబ్‌నగర్: మాదిగలకు సీఎం రేవంత్‌రెడ్డి మోసం చేశారని ఎమ్మార్పీఎస్అధినేత మందకృష్ణ మాదిగ ధ్వజమెత్తారు. ఎస్సీ వర్గీకరణ అమలుచేసే అధికారం రాష్ట్రాలకు ఇచ్చినా అమలు చేయకుండా ఉద్యోగాలను భర్తీచేశారని మండిపడ్డారు. అసెంబ్లీ సాక్షిగా వర్గీకరణను అమలుచేస్తామని చెప్పి, కమిషన్ పేరుతో కాలయాపన చేస్తున్నారని దుయ్యబట్టారు. ఎస్సీ వర్గీకరణ చేసుకునే అవకాశం రాష్ట్రాలకు ఉందని ఆగస్టు 1న సుప్రీంకోర్టు బెంచి తీర్పు చెప్పిందని వివరించారు. వర్గీకరణ అమలు చేయకుండా 11వేల టీచర్ఉద్యోగాలను భర్తీచేయడంతో మాదిగ బిడ్డలు 500కు పైగా […]
సామాజికసారథి, నాగర్ కర్నూల్: కొంతమంది మాల ప్రజాప్రతినిధులు, మేధావులు ఎస్సీ వర్గీకరణపై తప్పుగా మాట్లాడుతున్నారని మాదిగ ఐక్యవేదిక వ్యవస్థపాకులు, మాజీ ఎంపీటీసీ సభ్యుడు మంగి విజయ్ అన్నారు. భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తీర్పునే అవహేళన చేసేలా మాట్లాడుతున్నారని ఎద్దేవాచేశారు. సోమవారం ఆయన మాదిగ జేఏసీ నాయకులతో కలిసి నాగర్ కర్నూల్ లో మీడియాతో మాట్లాడారు. ఇటీవల నాగర్ కర్నూల్ లో జరిగిన మాలల సభలో ప్రజలను తప్పుదోవపట్టించేలా నాయకులు మాట్లాడారని గుర్తుచేశారు. రాజకీయ లబ్ధి కోసమే […]
ఎమ్మార్పీఎస్వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ మల్లాయిపల్లి బాలిక కుటుంబానికి మందకృష్ణ పరామర్శ సామాజిక సారథి, వనపర్తి: మల్లాయిపల్లి బాలిక లైంగిక దాడి కేసును ఫాస్ట్రాక్కోర్టుకు అప్పగించాలని ఎమ్మార్పీఎస్వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. సోమవారం ఆయన మల్లాయిపల్లి బాలిక కుటుంబాన్ని ఆయన పరమార్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో దళితులపై దాడులు, మహిళలపై లైంగిక దాడులు, హత్యలు పెరిగిపోయాయని, ఒక వారం రోజుల్లోనే చెన్నూరు నియోజకవర్గం మంచిర్యాల, వనపర్తి జిల్లా మల్లాయిపల్లిలలో […]
సామాజిక సారథి, హైదరాబాద్: ప్రమాదవశాత్తు కాలికి గాయమై సర్జరీ చేయించుకున్న ఎమ్మార్పీఎస్ అధినేత మంద కృష్ణమాదిగను బహుజన్ సమాజ్ పార్టీ(బీఎస్పీ) రాష్ట్ర కోఆర్డినేటర్ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మంగళవారం పరామర్శించారు. విద్యానగర్ లోని ఆయన నివాసానికి వెళ్లి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. త్వరగా కోలుకోవాలని డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆకాంక్షించారు. ఆయన వెంట బీఎస్పీ నేతలు చౌటి ప్రభాకర్, అనిల్ తదితరులు ఉన్నారు.
సారథిమీడియా, హైదరాబాద్: దళితయువతిపై 139 మంది లైంగికదాడి కేసు రోజుకో మలుపుతిరుగుతున్నది. తాజాగా ఈ వివాదంపై ఎమ్మార్పీఎస్ అధినేత మందకృష్ణ మాదిగ స్పందించారు. ఈ కేసుతో యాంకర్ ప్రదీప్‌కు ఎటువంటి సంబంధం లేదని మందకృష్ణ పేర్కొన్నారు. సోమవారం ఆయన సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో బాధిత యువతితోకలిసి మీడియా సమావేశం నిర్వహించారు. మందకృష్ణ ఏమన్నారో ఆయన మాటల్లోనే.. ‘యాంకర్ ప్రదీప్ మాచిరాజుకు ఈ కేసుతో సంబంధం లేదు. డాలర్ బాబు ఒత్తిడి వల్లే ప్రదీప్‌పై బాధితురాలు కేసు పెట్టారు. […]