భారీగా పోలీసుల మోహరింపు సామాజిక సారథి, కరీంనగర్: జీవోనం.317ను సవరించాలని డిమాండ్ చేస్తూ ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలకు సంఘీభావంగా కరీంనగర్లో ఆదివారం రాత్రి ఎంపీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తన క్యాంపు కార్యాలయం వద్ద జాగరణ దీక్ష చేపట్టారు. కొవిడ్ ఆంక్షల నేపథ్యంలో దీక్షకు అనుమతి లేకపోవడంతో పోలీసులు భారీగా మోహరించారు. పోలీసుల వలయాన్ని ఛేదించుకొని ఎంపీ బండి సంజయ్ బైక్ పై క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నది. […]