ఉమ్మడి వరంగల్జిల్లాలో కరోనా బారిన పోలీసులు సామాజిక సారథి, వరంగల్: కరోనా థర్డ్ వేవ్ ఇప్పుడు అందరినీ కలవరపెడుతోంది. సెకండ్ డోస్ వ్యాక్సిన్ పూర్తి చేసుకున్న వారిపైనా కరోనా దాడి చేస్తుండడంతో ఉమ్మడి వరంగల్ జిల్లాలో పోలీసు అధికారులతో పాటు పోలీసు సిబ్బంది పెద్ద సంఖ్యలో కరోనా బారిన పడుతున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో విధులు నిర్వహిస్తున్న పోలీస్ సిబ్బంది పదుల సంఖ్యలో కరోనా బారిన పడటం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా కేయూ పోలీస్ స్టేషన్ సీఐ […]
కొత్తవారి కదలికలపై సమాచారం అందించాలి ఇంటి పరిసరాల్లో సీసీ కెమెరాల ఏర్పాటు తప్పనిసరి సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర సామాజికసారథి, హైదరాబాద్: సంక్రాంతి పండుగ పిల్లలకు సెలవులు ఉండటంతో చాలా మంది ప్రయాణాలు చేస్తుంటారు. ఇదే అనుగా దొంగలు చేతివాటం ప్రదర్శిస్తుంటారు. ఊళ్లకు వెళ్లే వారు అప్రమత్తంగా ఉండాలని, ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర హెచ్చరించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘సంక్రాంతి పండుగ దృష్ట్యా చోరీల నియంత్రణకు అన్ని రకాల […]
నల్లగొండ అదనపు ఎస్పీ నర్మద సామాజిక సారథి, నల్లగొండ క్రైం: ఆపరేషన్ స్మైల్- 8ను విజయవంతం చేయడానికి, అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి మంచి ఫలితాలు సాధించాలని అదనపు ఎస్పీ నర్మద అన్నారు. నల్లగొండ జిల్లా పోలీసు కార్యాలయంలో కార్మికశాఖ, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ, పోలీస్, బాలల సంక్షేమ సమితి, ఇతరశాఖల అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. తప్పిపోయిన బాలలను గుర్తించి వారి తల్లిదండ్రుల వద్దకు చేర్చేలా కృషి చేయాలని ఆదేశించారు. బాలలతో […]
నగర శివార్లలో అసాంఘిక కార్యకలాపాలపై నిఘా వార్షిక నివేదికను ఆవిష్కరించిన రాచకొండ సీపీ మహేష్ భగవత్ సామాజికసారథి, హైదరాబాద్: రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఈ ఏడాది నాలుగు శాతం నేరాలు పెరిగాయి. అలాగే పోలీస్ స్టేషన్‌కు వచ్చి ఇచ్చిన ఫిర్యాదులపై ఎఫ్ఐఆర్లు నమోదు చేయడంలో కేసుల సంఖ్య పెరిగిందని రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ అన్నారు. రాచకొండ పోలీస్ కమిషనరేట్ వార్షిక నివేదికను సోమవారం ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నేరాలు చేసిన […]
– హుస్నాబాద్ ఏసీపీ వాసాల సతీశ్ సామాజిక సారథి, హుస్నాబాద్: ఓ కిరాణా షాపులో భారీగా నగదు చోరీకి పాల్పడిన దొంగను అరెస్టు చేసినట్లు ఏసీపీ వాసాల సతీశ్ తెలిపారు. శనివారం హుస్నాబాద్ సర్కిల్ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమాశంలో నిందితుడిని ప్రవేశపెట్టి మాట్లాడారు. వివరాల్లోకి వెళితె సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం పోతారం (ఎస్) గ్రామంలోని లక్ష్మిప్రసన్న కిరాణంలో అక్టోబర్ 8న ఓ గుర్తు తెలియని వ్యక్తి మోటార్ వెహికిల్ పై […]
ఆయనో ఉన్నత స్థానంలో ఉన్న పోలీస్ అధికారి.. డీజీ స్థాయి కొలువు చేస్తున్నాడు. కానీ బుద్ధి మాత్రం బాగాలేదు. భార్య ఉండగానే మరో మహిళను ఇంటికి తీసుకొచ్చాడు. ఆమెతో సరసాలు ఆడుతుంటే భార్య గమనించి నిలదీసింది. దీంతో రెచ్చిపోయిన సదరు అధికారి భార్యను విచక్షణారహితంగా కొట్టాడు. ఈ దృశ్యాలను కన్న కొడుకు ఫోన్లో రికార్డ్ చేసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్చేశాడు. ఈ వీడియో వైరల్‌గా మారింది. స్పందించిన ఉన్నతాధికారులు ఉద్యోగం నుంచి సస్పెండ్ చేశారు. పురుషోత్తం శర్మ […]
ఆమె ఓ అందమైన యువతి.. ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది. ఈజీ మనికి అలవాటు పడింది. డబ్బున్నవాళ్లను పరిచయం చేసుకోవడం.. వారిని ముగ్గులోకి దించడం ఆమె హాబీ. పెద్ద పెద్ద హోటళ్లు, రెస్టారెంట్లు లేదా సోషల్‌మీడియాలో ఆమె ధనవంతులను పరిచయం చేసుకుంటుంది. తర్వాత వారితో మత్తెక్కించేలా మాట్లాడుతుంది. అనంతరం వాళ్లను తన ఇంటికి తీసుకెళ్లి.. శారీరకంగా లొంగదీసుకుంటుంది. అనంతరం అక్కడ సన్నిహితంగా ఉన్న సమయంలో వీడియోలు తీస్తుంది. ఆ తర్వాత ఆ వీడియోలు సోషల్‌మీడియాలో పెడతానంటూ బెదిరించి లక్షల్లో […]
సారథి న్యూస్, గద్వాల: నిత్యం దొంగతనాలు చేస్తూ.. పోలీసులను పరుగులు పెట్టిస్తున్న ఓ ముఠా ఎట్టకేలకు చిక్కింది. జోగుళాంబ గద్వాల జిల్లా శాంతినగర్ పీఎస్ పరిధిలో గత మూడేండ్లుగా ఓ ముఠా తరుచూ దొంగతనాలకు పాల్పడుతున్నది. ఇప్పటికీ ఈ ముఠా సభ్యులు 11 దొంగతనాలు చేశారు. ఈ నెల 18న రాజోలి వైన్‌షాప్‌లో ఈ దొంగలు చోరీ చేసి రూ. 45 వేలు, మద్యం బాటిళ్లు ఎత్తుకెళ్లారు. సీసీ ఫుటేజీ ఆధారంగా విచారణ చేపట్టిన పోలీసులు.. సోమవారం […]