Breaking News

పెద్దశంకరంపేట

ఆసక్తిగా సాగిన పంచాంగ పఠనం

ఆసక్తిగా సాగిన పంచాంగ పఠనం

వైభవంగా ఉగాది వేడుకలు సామాజికసారథి, పెద్దశంకరంపేట: పెద్దశంకరంపేటతో పాటు మండలంలోని ఆయా గ్రామాల్లో శుభకృత్​నామ ఉగాది ఉత్సవాలను శనివారం ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. పేటలోని రామాలయంలో ఎంపీపీ జoగం శ్రీనివాస్, సర్పంచ్ అలుగుల సత్యనారాయణ, గ్రామ ప్రజలు ప్రత్యేకపూజలు నిర్వహించారు. అనంతరం వేద బ్రాహ్మణ పండితులు మహేశ్​శర్మ పంచాంగ శ్రవణం పాటించగా ప్రజాప్రతినిధులు, గ్రామపెద్దలు, గ్రామస్తులు, అధికసంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ బాధ్యులు, గ్రామపెద్దలు గుజ్జరి కనకరాజు, కందుకూరి రవీందర్, మురళి పంతులు, సుభాష్ గౌడ్, […]

Read More
సనాతన ధర్మరక్షణకు పాటుపడాలి

సనాతన ధర్మరక్షణకు పాటుపడాలి

ఆర్ఎస్ఎస్ మెదక్ విభాగ్ ప్రచార ప్రముఖ బండి వెంకటేశ్వర్లు సామాజిక సారథి, పెద్దశంకరంపేట: సనాతన భారతీయ సంస్కృతి సంప్రదాయాలను, ధర్మరక్షణ కోసం ప్రతిఒక్కరూ పాటుపడాలని ఆర్ఎస్ఎస్ మెదక్ విభాగ్ ప్రచార ప్రముఖ బండి వెంకటేశ్వర్లు అన్నారు. శనివారం పెద్దశంకరంపేటలోని శ్రీ సరస్వతి శిశుమందిర్ లో ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో ఉగాది ఉత్సవం నిర్వహించారు. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ వ్యవస్థాపకులు డాక్టర్ కేశవరావు బలిరాం పంత్ హెడ్గేవార్ జన్మదినాన్ని సైతం జరుపుకున్నారు. హిందూ సంఘటన ధ్యేయంగా రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ […]

Read More
శాంతియుతంగా వినాయక ఉత్సవాలు

శాంతియుతంగా వినాయక ఉత్సవాలు

సామాజిక సారథి, పెద్దశంకరంపేట: ప్రజలంతా శాంతియుత వాతావరణంలో వినాయక ఉత్సవాలను జరుపుకోవాలని పెద్దశంకరంపేట ఎస్సై నరేందర్ అన్నారు. ఆదివారం పెద్దశంకరంపేట  పోలీస్ స్టేషన్ లో ఎంపీపీ జంగం శ్రీనివాస్ అధ్యక్షతన అన్ని గ్రామాల ప్రజాప్రతినిధులు గణేష్ మండపాల నిర్వాహకులతో నిర్వహించిన శాంతి సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈనెల 10న వినాయకచవితి పండుగను పురస్కరించుకుని తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వివరించారు. వినాయక నవరాత్రి ఉత్సవాలు ముగిసే వరకు ప్రశాంత వాతావరణంలో పండుగలు జరుపుకోవాలని, అందుకు నిర్వాహకులు పోలీసులకు సహకరించాలని కోరారు. […]

Read More
విద్యాభివృద్ధికి కృషిచేద్దాం

విద్యాభివృద్ధికి కృషిచేద్దాం

సామాజిక సారథి, పెద్దశంకరంపేట: ఉపాధ్యాయులు విద్యాభివృద్ధికి కృషిచేయాలని పెద్దశంకరంపేట ఎంపీపీ జంగం శ్రీనివాస్ అన్నారు. గురుపూజోత్సవం సందర్భంగా ఆదివారం పెద్దశంకరంపేట ఎంపీడీవో ఆఫీసు ఆవరణలో పలువురు ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భావితరాల పౌరులను తీర్చిదిద్దే బాధ్యత టీచర్లదేనని అన్నారు. విద్యార్థుల భవిష్యత్తు తరగతి గదిలో  రూపుదిద్దుకుంటుందన్నారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ లక్ష్మీరమేష్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మురళి పంతులు, సర్పంచ్​ల ఫోరం మండలాధ్యక్షుడు రాములు, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు దత్తు, రైతుబంధు అధ్యక్షుడు […]

Read More
చిన్నారులకు పీసీవీ టీకాలు

చిన్నారులకు పీసీవీ టీకాలు

సామాజిక సారథి, పెద్దశంకరంపేట: చిన్నారులకు పీసీవీ టీకాలు తప్పనిసరిగా వేయించాలని మెదక్​జిల్లా పెద్దశంకరంపేట మండల వైద్యాధికారి పుష్పలత కోరారు. బుధవారం పెద్దశంకరంపేటలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చిన్నారులకు టీకాలు వేసిన అనంతరం జూకల్ సబ్ సెంటర్ ను పరిశీలించారు. ఏడాది లోపు చిన్నారులకు మూడు రోజులు తప్పనిసరిగా వేయించాలని ఆమె సూచించారు. కార్యక్రమంలో పీహెచ్​సీ సిబ్బంది సాయిలు, భూమయ్య, యాదయ్య, వెంకటేశం, కమల, స్వరూప, లలిత పాల్గొన్నారు.

Read More
పెండింగ్ చలాన్ల పరిశీలన

పెండింగ్ చలాన్ల పరిశీలన

సారథి, పెద్దశంకరంపేట: మెదక్​ జిల్లా నాందేడ్– అకోలా హైవేపై పెద్దశంకరంపేట అంబేద్కర్ చౌరస్తాలో బుధవారం పోలీసులు వాహనాలను తనిఖీ చేశారు. ట్రెయినీ ఎస్సై దీక్షిత్ రెడ్డి ఆధ్వర్యంలో వాహనాల పెండింగ్​ చలాన్లను పరిశీలించారు. ప్రతిఒక్కరూ వాహనం నడిపేటప్పుడు ధ్రువీకరణ పత్రాలు, డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలన్నారు. వారి వెంట పోలీస్​ సిబ్బంది ఉన్నారు.

Read More
అట్టహాసంగా తల్లిపాల వారోత్సవాలు

అట్టహాసంగా తల్లిపాల వారోత్సవాలు

సారథి, పెద్దశంకరంపేట: మెదక్​ జిల్లా పెద్దశంకరంపేటలోని 9వ నంబర్ అంగన్​వాడీ కేంద్రంతో పాటు తిరుమలాపూర్ సెంటర్ ఆధ్వర్యంలో తల్లిపాల వారోత్సవాలను బుధవారం అట్టహాసంగా నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన పబ్లిక్ హెల్త్ నర్సు సంపూర్ణ మాట్లాడుతూ.. పుట్టినబిడ్డకు తల్లిపాలే శ్రేష్టమని అన్నారు. ముర్రుపాలతో బిడ్డలో రోగనిరోధక శక్తి పెరిగి ఆరోగ్యవంతంగా ఉంటాడని ఆమె అవగాహన కల్పించారు. అనంతరం గర్భిణులు, బాలింతలతో పాటు విద్యార్థుల తల్లిదండ్రులతో ర్యాలీ నిర్వహించి తల్లిపాల ఆవశ్యకతను వివరించారు. ఈ సందర్భంగా పలువురు మహిళలకు వైద్యారోగ్య […]

Read More
భవిత కేంద్రంలో తనిఖీ

భవిత కేంద్రంలో తనిఖీ

సారథి, పెద్దశంకరంపేట: పెద్దశంకరంపేట మండల కేంద్రంలోని భవిత కేంద్రాన్ని జిల్లా సెక్టరియల్ అధికారి ఆర్.సూర్యప్రకాష్ శుక్రవారం సందర్శించి పలు రికార్డులను పరిశీలించారు. మండల ఐఈఆర్ డీ సమన్వయకర్తకు పలు సూచనలు చేశారు. మండలంలోని ప్రత్యేక అవసరాలు ఉన్న విద్యార్థుల సంఖ్య, వారికి అవసరమైన సదుపాయాలు, వారికి ఉన్న వనరులను ప్రత్యేకంగా మండల సమన్వయకర్తకు వివరించారు. ఆ దిశగా ప్రభుత్వం ప్రత్యేకావసరాలు కలిగిన పిల్లలకు కల్పిస్తున్న సౌకర్యాలు ప్రతి పిల్లవాడికి చేరేలా కృషిచేయాలని సూచించారు. టెలీసర్వీస్ ప్రతిరోజు పిల్లవాడికి […]

Read More