Breaking News

పాలెం

పిలవని పేరంటానికి రావొద్దు!

పిలవని పేరంటానికి రావొద్దు!

సామాజికసారథి, నాగర్ కర్నూల్: బిజినేపల్లి మండల పరిధిలోని పాలెం గ్రామంలో గత వారం రోజుల నుండి బీఆర్ఎస్ పార్టీకి చెందిన వ్యక్తి కాంగ్రెస్ పార్టీ లీడర్ గా వచ్చి ఫొటోలు దిగుతుండటం పార్టీ శ్రేణుల్లో అయోమయం నెలకొంది. అలాంటి వ్యక్తితో పార్టీకి నష్టం జరుగుతుందని కార్యకర్తలు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ దృష్టికి తీసుకెళ్లారు. అలాంటి వారితో తమకు ఎలాంటి సంబంధం లేదని పిలవకుండా వారే వచ్చి ఫొటోలు దిగుతున్నారని తేల్చిచెప్పారని డీసీసీ వైస్ ప్రెసిడెంట్ ముక్తార్ అన్నారు. మంగళవారం […]

Read More
ఆర్మీ మాజీ జవాన్​ చిల్లర చేష్టలు!

ఆర్మీ మాజీ జవాన్​ చిల్లర చేష్టలు!

సామాజికసారథి, బిజినేపల్లి: నాగర్​ కర్నూల్​ జిల్లా బిజినేపల్లి మండలంలోని పాలెం గ్రామానికి చెందిన ఓ మాజీ ప్రజాప్రతినిధి భార్యపై అసభ్యకరంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఆర్మీ మాజీ జవాన్ ను స్థానికులు చెప్పులతో చితకబాదారు. పోలీసుల దృష్టికి వెళ్లడంతో వారు వార్నింగ్​ ఇచ్చారు. అంతకుముందు అతడి ఇంటి ముందు ఆ గ్రామ మహిళలు, యువకులు ఆందోళన చేపట్టారు. స్థానికుల కథనం.. పాలెం గ్రామానికి చెందిన ఆర్మీ మాజీ జవాన్ దుగ్యాల వెంకటయ్య.. ఓ మాజీ ప్రజాప్రతినిధి […]

Read More
కిస్తీలు కట్టలేక.. అప్పులు తీర్చలేక

కిస్తీలు కట్టలేక.. అప్పులు తీర్చలేక

వీఆర్ఏ కుటుంబం ఆత్మహత్యాయత్నం పురుగు మందు తాగిన భార్య నాగర్​ కర్నూల్​ జిల్లా పాలెంలో విషాదకర ఘటన సామాజికసారథి, బిజినేపల్లి: జీతం రాక.. చేతిలో చిల్లిగవ్వలేక.. అప్పులు తీర్చలేక ఓ వీఆర్ఏ కుటుంబం పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. స్థానికంగా కలకలం రేపిన ఈ ఘటన మంగళవారం బిజినేపల్లి మండలం పాలెం గ్రామంలో చోటుచేసుకున్నది. బాధిత కుటుంబసభ్యుల కథనం మేరకు.. వేపూరి రాజేశ్ పాలెం వీఆర్ఏగా పనిచేస్తున్నాడు. గతంలో కుటుంబ అవసరాల కోసం ఏడాదిన్నర క్రితం […]

Read More
వేంకటేశ్వరస్వామికి ప్రత్యేకపూజలు

వేంకటేశ్వరస్వామికి ప్రత్యేకపూజలు

సామాజిక సారథి, నాగర్ కర్నూల్: స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కూచకుళ్ల దామోదర్ రెడ్డి తనయుడు, యువనేత డాక్టర్ రాజేష్ రెడ్డి నాగర్ కర్నూల్ నియోజకవర్గంలోని పలు శుభకార్యాల్లో ఆదివారం విస్తృతంగా పాల్గొన్నారు. నాగర్ కర్నూల్ లోని ముఖ్యకార్యకర్తలతో కలిసి తాడూరు మండల కేంద్రంలోని బొడ్రాయి పండుగలో పాల్గొన్నారు. అనంతరం అక్కడి నుంచి నాగర్ కర్నూల్, తెలకపల్లి గ్రామాల్లో కార్యకర్తల పిలుపుమేరకు పలు వివాహ శుభకార్యాల్లో పాల్గొన్నారు. అనంతరం బిజినేపల్లి మండలంలోని పాలెం వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా అక్కడ […]

Read More
పెంటోనిచెరువు నుంచి ఆయకట్టుకు నీళ్లు

పెంటోనిచెరువు నుంచి ఆయకట్టుకు నీళ్లు

సారథి, బిజినేపల్లి: నాగర్​కర్నూల్ ​జిల్లా బిజినేపల్లి మండలం పాలెం గ్రామంలోని పెంటోనిచెరువు తూము నుంచి రైతులకు చెరువు కింద సుమారు వెయ్యి ఎకరాల ఆయకట్టులో పంటలు సాగుచేసేందుకు వీలుగా సర్పంచ్ గోవింద్ లావణ్య నాగరాజు, ఎంపీపీ పుప్పాల శ్రీనివాస్ గౌడ్ సోమవారం నీటిని విడుదల చేశారు. రైతు సంక్షేమమే ధ్యేయంగా మిషన్ కాకతీయ ద్వారా ప్రతి గ్రామంలో చెరువులను నీటితో నింపిన ఘనత టీఆర్ఎస్​ప్రభుత్వానికే దక్కిందన్నారు. రైతులు పంటలు పండించడానికి వీలుగా నీటి వసతి కల్పించిన నాగర్ […]

Read More
పర్యావరణాన్ని కాపాడుకుందాం

పర్యావరణాన్ని కాపాడుకుందాం

సారథి, బిజినేపల్లి: ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా శనివారం నాగర్ కర్నూల్ జిల్లా పాలెం జిల్లా వైద్యాశాఖ కార్యాలయ ఆవరణలో జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ సాయినాథ్ రెడ్డి ఆధ్వర్యంలో వైద్యశాఖ అధికారులు, సిబ్బంది మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతిఒక్కరూ పర్యావరణ పరిరక్షణకు అంకితం కావాలని పిలుపునిచ్చారు. వాతావరణ సమతుల్యతను కాపాడాలన్నారు. ఖాళీప్రదేశాల్లో మొక్కలు నాటాలని కోరారు. మనుషుల మనుగడ ప్రకృతితో ముడిపడి ఉందన్నారు. కార్యక్రమంలో డాక్టర్ బి.కృష్ణయ్య, హెల్త్ సూపర్ వైజర్ […]

Read More
పాలెం ప్రాజెక్టులో యువకుడి డెడ్​బాడీ

పాలెం ప్రాజెక్టులో యువకుడి డెడ్​బాడీ

సారథి న్యూస్, వెంకటాపురం: నాలుగు రోజుల క్రితం అదృశ్యమైన ములుగు జిల్లా నూగురు వెంకటాపురం మండల కేంద్రంలోని కుమ్మరివీధికి చెందిన పూసం యశ్వంత్(20) అనే యువకుడి డెడ్​బాడీ గురువారం పాలెం ప్రాజెక్టులో లభ్యమైంది. గ్రామస్తుల కథనం మేరకు.. పూసం యశ్వంత్ నాలుగు రోజుల క్రితం ఇంట్లో ఎవరికీ చెప్పకుండా బయటకు వెళ్లాడు. ఆ సమయంలో ఇంట్లో వారంతా వేరే బంధువుల ఇంటికి వెళ్లి ఉండొచ్చని భావించి ఆరా తీయలేదు. రెండురోజులైనా ఇంటికి తిరిగి రాకపోవడంతో ఇంటి సభ్యులు […]

Read More
శాస్త్రోక్తంగా వేంకటేశ్వర స్వామి కల్యాణం

శాస్త్రోక్తంగా వేంకటేశ్వర స్వామి కల్యాణం

సారథి న్యూస్, పాలెం(బిజినేపల్లి): నాగర్​కర్నూల్ ​జిల్లా బిజినేపల్లి మండలంలోని పాలెం వేంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రధాన అర్చకులు కొరవి రామనుజచార్యులు ధనుర్మాస ప్రత్యేక పూజలను గురువారం శాస్త్రోక్తంగా జరిపించారు. భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి ఎస్.ఆంజనేయులు, సహాయ అర్చకుడు కొరవి జయంత్, శుక్ల, చక్రపాణి, ఆలయ సిబ్బంది శివకుమార్, భక్తులు, మహిళలు పాల్గొన్నారు.

Read More