సామాజికసారథి, నాగర్ కర్నూల్ బ్యూరో: గ్యారెంటీలు కాదు.. గారడీ మాటలు, 420 హామీలతో గద్దెనెక్కిన సీఎం రేవంత్ రెడ్డిని పార్లమెంట్ ఎన్నికల్లో ఓడించాలని నాగర్ కర్నూల్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పిలుపునిచ్చారు. శనివారం ఆయన బిజినేపల్లితో పాటు తిమ్మాజిపేటలో రోడ్ షో నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా అశేష ప్రజానీకాన్ని ఉద్దేశించి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రసంగించారు. కేసీఆర్ అమలుచేసిన పథకాలే తప్ప.. […]
సామాజికసారథి, అలంపూర్: నాగర్ కర్నూల్ ఎంపీగా డా. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు మించిన ఎంపీ అభ్యర్థి కాంగ్రెస్, బీజేపీలో ఎవరూ లేరని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారక రామారావు అన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి మల్లు రవిని గెలిపిస్తే రేవంత్ రెడ్డికి ఇచ్చిన డబ్బు సంచులు ఢిల్లీలో పంచడానికి పనికొస్తాడని విమర్శించారు. ప్రవీణ్ కుమార్ ను గెలిపిస్తే పేదల కష్టాలు తీర్చడానికి పార్లమెంట్ లో ప్రజల గొంతుక అవుతారని అన్నారు. మంగళవారం జోగుళాంబ గద్వాల జిల్లా అలంపూర్ […]
సామాజికసారథి, కొడంగల్/నాగర్ కర్నూల్ బ్యూరో: పాలమూరుకు కేసీఆర్ తీరని అన్యాయం చేశారని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. కాంగ్రెస్ హయాంలో ప్రారంభించిన పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కమీషన్ల కక్కుర్తితో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే చందంగా ఉందన్నారు. కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్, రాజోలిబండ, తుమ్మిళ్ల ప్రాజెక్టుల వద్ద కుర్చీ వేసుకుని పనులు పూర్తిచేస్తానని చెప్పిన కేసీఆర్.. సీఎం అయిన తర్వాత ఫాంహౌస్‌కే పరిమితమయ్యారు. మంగళవారం నారాయణపేట జిల్లా మద్దూరులో కొడంగల్ నియోజకవర్గ కాంగ్రెస్ ముఖ్యనాయకుల సమావేశంలో […]