టీడీపీ అధినేత చంద్రబాబు కుప్పం ఆస్పత్రిలో ఆక్సిజన్ ప్లాంట్ ప్రారంభం చిత్తూరు: కుప్పం నియోజకవర్గంలో మూడు రోజుల పర్యటనలో భాగంగా శుక్రవారం ప్రభుత్వ హాస్పిటల్‌లో ఆక్సిజన్ ప్లాంట్‌ను టీడీపీ అధినేత చంద్రబాబు ప్రారంభించారు. ఇటీవల కాలంలో కరోనాతో బాధపడుతున్నవారు ఆక్సిజన్ లేక తీవ్ర ఇబ్బందులు పడిన నేపథ్యంలో కుప్పం నియోజకవర్గానికి ఆక్సిజన్ కొరత ఉండకూడదని భవిష్యత్ కార్యాచరణతో ఈ ప్లాంట్ ను ప్రారంభించినట్లు తెలిపారు. పలమనేరు మాజీ ఎమ్మెల్యే అమర్నాథ్రెడ్డి, కుప్పం నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు పెద్దసంఖ్యలో […]