సారథి న్యూస్, మానవపాడు: అయోధ్య నిధి సమర్పణ అభియాన్ కార్యక్రమంలో భాగంగా జోగుళాంబ గద్వాల జిల్లా మానవపాడు మండలం చెన్నిపాడు గ్రామంలో రాముడి ప్రతిమతో ఘనంగా ఊరేగింపు నిర్వహించారు. జనహిత, హిందువాహిని ఆధ్వర్యంలో కోలాటాలు వేశారు. నృత్యాలు చేశారు. జై శ్రీరామ్ నినాదాలతో ఆద్యంతం ఊరేగింపు కన్నులపండుగా సాగింది. ఎన్నో ఏళ్లు ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువుల చిరకాల నిరీక్షణ సఫలమై భవ్య రామ మందిర నిర్మాణం అవుతున్నందున అందరూ తమవంతు సహాయ సహకారాలు అందజేశారు. కార్యక్రమంలో ఎల్లారెడ్డి, […]
న్యూఢిల్లీ: రిపబ్లిక్ డే వేడుకలు ఈ సారి విభిన్నంగా వినూత్నరీతిలో కొనసాగనున్నాయి. ఈ ఏడాది ఎన్నో కొత్త శకటాలు దర్శనమివ్వనున్నాయి. రఫేల్ యుద్ధవిమానాలను తొలిసారిగా ఈ ఏడాది పరేడ్‌లో ప్రదర్శించనున్నారు. గత సెప్టెంబర్‌లో ఫ్రాన్స్ నుంచి వచ్చిన ఈ విమానాలు భారత వైమానిక దళంలో చేరాయి. మొట్టమొదటిసారిగా మహిళా యుద్ధ పైలెట్ లెఫ్ట్‌నెంట్ భావనాకాంత్ ప్రదర్శనలో పాల్గొననున్నారు. భారత వాయుసేనకు చెందిన తేలికపాటి యుద్ధవిమానాలు, యుద్ధ హెలికాప్టర్లు, సుఖోయ్–30 విమాన శకటాలను భావన ముందుండి నడిపిస్తారు. రిపబ్లిక్ డే వేడుకల్లో […]
సారథి న్యూస్, రామయంపేట: మెదక్ జిల్లా నిజాంపేట మండలంలోని నందిగామ గ్రామంలో శ్రీరామ తీర్థ క్షేత్ర ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో ఆదివారం శ్రీరామ నిధిని సేకరించారు. కార్యక్రమంలో ఆకుల రమేష్, ఆకుల రాజు, ఎడ్ల నరసింహారెడ్డి, బుచ్చనరేష్, సంతోష్, ఆకుల భాను తదితరులు పాల్గొన్నారు. అలాగే నిజాంపేట పట్టణంలో జడ్పీటీసీ పంజా విజయ్ కుమార్ రూ.21,116 అయోధ్య రామమందిరానికి విరాళంగా ఇచ్చారు. శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర మెదక్ జిల్లా సంయోజక్ పబ్బా సత్యనారాయణ, రామాయంపేట ఖండ […]
సారథి న్యూస్, నిజాంపేట: శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ నిర్వహిస్తున్న శ్రీరామ జన్మభూమి నిధి సమర్పణ అభియాన్ లో భాగంగా శుక్రవారం మెదక్ జిల్లా నిజాంపేట పట్టణంలో జనజాగరణ ప్రారంభ పూజాకార్యక్రమం నిర్వహించారు. రామమందిర నిర్మాణానికి అయ్యే నిధుల సేకరణ కార్యక్రమానికి అందరి నుంచి అపూర్వ మద్దతు లభించింది. కార్యక్రమంలో శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర మెదక్ జిల్లా సంయోజక్ పబ్బ సత్యనారాయణ, జిల్లా సహ సంయోజక్ బండి వెంకటేశ్వర్లు, రామాయంపేట సహ సంయోజక్ పుట్టి […]
సారథి న్యూస్, నారాయణఖేడ్: అయోధ్య రామమందిరం భూమి పూజ ప్రోగ్రాంలో రాష్ట్రం నుంచి పిలుపును అందుకున్న ఏకైక వ్యక్తి సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ డివిజన్ పరిధిలోని కొండాపూర్ ఆశ్రమ పీఠాధిపతి సంగ్రామ్ మహారాజ్. భూమి పూజ అనంతరం ఆశ్రమానికి చేరుకున్న ఆయనను శనివారం నారాణయఖేడ్ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్‌రెడ్డి కలిశారు. ఆశీస్సులు తీసుకుని శాలువాతో ఘనంగా సన్మానించారు. అయోధ్య వెళ్లొచ్చి నారాయణఖేడ్ కీర్తిని పెంచారని కొనియాడారు. తర్వాత స్థానిక హనుమాన్ మందిరంలో ప్రత్యేకపూజలు చేశారు. హైందవ సంస్కృతి […]
న్యూఢిల్లీ: అయోధ్య రామజన్మభూమిలో మందిరం నిర్మాణం కోసం శంకుస్థాపన జరుగుతున్న సందర్భంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రంగోళీని ట్వీట్ చేశారు. ఒక చిన్న గుడి ముందు ముగ్గుతో శ్రీరామ్ అని రాసిన ముగ్గు ఫొటోను ఆమె ట్వీట్ చేశారు. ‘చాలా ఇళ్లలో ప్రతిరోజు రంగోళీ, కోలమ్‌ను వేస్తారు. బియ్యంపిండితో ప్రతి రోజు ఫ్రెష్‌గా వేసుకుంటారు. మా ఇంటి దగ్గరలోని ఒక చిన్నగుడిలో ఈ రోజు ప్రత్యేకంగా ఇలా వేశారు’ అని మంత్రి ట్వీట్ చేశారు. […]
న్యూఢిల్లీ: ఉత్తర్‌ప్రదేశ్‌లోని అయోధ్య రామ మందిర నిర్మాణానికి ప్రధాని మోడీ భూమి పూజ చేసిన సందర్భంగా కాంగ్రెస్ నేత రాహల్ గాంధీ ట్వీట్ చేశారు. ట్విట్టర్ ద్వారా ఆయన పూజ నిర్వహించారు. రాముడు మంచి లక్షణాలు కలిగిన అభివ్యక్తి అని వర్ణించారు. ‘రాముడు అంటే ప్రేమ, అసహ్యంగా కనిపించరు. రాముడు అంటే కరుణ, ఇది ఎప్పుడూ క్రూరంగా అనిపించదు, రాముడు అంటే న్యాయం, ఎక్కడా అన్యాయంలో కనిపించడు’ అని రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. మొదటి నుంచి […]
అయోధ్య: ఎన్నో దశాబ్దాల పోరాట ఫలితంగానే అయోధ్యలో రామమందిరం నిర్మించుకోబోతున్నామని ఉత్తర్‌ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ పేర్కొన్నారు. బుధవారం మధ్యాహ్నం ప్రధాని నరేంద్రమోడీ అయోధ్యలో రామాలయ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం యోగి మాట్లాడుతూ.. సుదీర్ఘ నిరీక్షణ అనంతరం అయోధ్యలో రామాలయ కల సాకారమైందని చెప్పారు. ఇక అయోధ్య ప్రపంచస్థాయి నగరంగా రూపుదిద్దుకోబోతున్నదని చెప్పారు. ప్రధాని మోడీ నేతృత్వంలో ఇక్కడ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను చేపడతామని చెప్పారు. అనంతరం ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ మాట్లాడుతూ.. రామమందిరం […]