ట్రస్మా రాష్ట్ర అధ్యక్షులు యాదగిరి శేఖర్ రావు సామాజిక సారథి, సిద్దిపేట: విద్యా సంస్థలకు ప్రభుత్వం సెలవులను వెంటనే రద్దు చేయాలని తెలంగాణ ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యం (ట్రస్మా) రాష్ట్ర అధ్యక్షులు యాదగిరి శేఖర్ రావు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆదివారం ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రైవేటు విద్యాసంస్థల యాజమాన్యాలు కొవిడ్ నిబంధనలు పాటిస్తూ, విద్యార్థులకు విద్యనందిస్తున్నాయన్నారు. సంక్రాంతి పండుగ సెలవుల పేరుతో పాఠశాలకు ప్రభుత్వం ముందుగానే సెలవులు ప్రకటించిందని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా కరోనా […]
లాలూ ప్రసాద్ యాదవ్ కూడా వెళ్లొచ్చారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సామాజికసారథి, హైదరాబాద్: మరోసారి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సీఎం కేసీఆర్‌పై తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని, ఈ విషయంలో కేంద్రం సీరియస్‌గా ఉందన్నారు. సీఎం కేసీఆర్‌పై కేంద్ర ప్రభుత్వం చర్యలకు సిద్ధమైందని, ఎప్పుడైనా జైలుకు వెళ్లకతప్పదని తెలిపారు. బుధవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో స్వామి వివేకానంద జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో బండి సంజయ్ తో […]
రాష్ట్రాన్ని ద్రోహుల అడ్డాగా మార్చేందుకు కుట్రలు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సామాజికసారథి, వరంగల్: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకించిన సీపీఎం, ఎంఐఎం పార్టీలతో సీఎం కేసీఆర్చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ధ్వజమెత్తారు. రాష్ట్రాన్ని తెలంగాణ ద్రోహుల అడ్డాగా మార్చేందుకు కుట్రలు చేస్తున్నారని విమర్శించారు. బీజేపీ ఆధ్వర్యంలో హనుమకొండలో ఏర్పాటుచేసిన నిరసన సభలో అసోం సీఎం హిమంత్ బిశ్వశర్మతో కలిసి బండి సంజయ్ పాల్గొన్నారు. రాష్ట్రంలో కమలం జెండా ఎగరవేస్తామని వ్యక్తం […]
విడుదల చేయాలని జైళ్లశాఖకు హైకోర్టు ఆదేశాలు రిమాండ్ రిపోర్టును తప్పుబట్టిన ఉన్నతన్యాయస్థానం కేసు విచారణను 7వ తేదీకి వాయిదా సామాజికసారథి, హైదరాబాద్: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కు హైకోర్టులో ఊరట లభించింది. ఆయనను విడుదల చేయాలని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. జ్యూడీషియల్ రిమాండ్ పై హైకోర్టు స్టే విధించింది. వ్యక్తిగత పూచీకత్తు, రూ.40వేల బాండ్ పై విడుదల చేయాలని జైళ్లశాఖ డీజీని హైకోర్టు ఆదేశించింది. కొవిడ్ నిబంధనలను ఉల్లంఘించారని రిమాండ్ కు ఆదేశాలు […]
మంత్రి గంగుల కమలాకర్ సామాజికసారథి, కరీంనగర్: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన జాగరణ దీక్ష, పోలీసులు భగ్నం చేయడంపై ఆదివారం రాత్రి మంత్రి గంగుల కమలాకర్ స్పందించారు. గొడవలు సృష్టించి రాజకీయ లబ్ధి పొందడానికి ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. ఒక ఎంపీ చట్టాలను ఉల్లంఘిస్తే ఎలా? అని నిలదీశారు. ఢిల్లీలో ఎవరైనా దీక్షలు చేస్తే కేంద్ర ప్రభుత్వం ఊరుకుంటుందా? అని ప్రశ్నించారు. ఉద్యోగుల విజ్ఞప్తి మేరకే జీవోనం.317 ఇచ్చామని తెలిపారు. కొవిడ్ నిబంధనలు పాటించే బాధ్యత […]
ఉద్యోగులతో చర్చించాకే నిర్ణయించాలి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సామాజికసారథి, హైదరాబాద్: సీఎం కేసీఆర్ అనాలోచిత.. అర్ధరాత్రి నిర్ణయాలతో ఉద్యోగులు, టీచర్లు ఇబ్బందులు పడుతున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. ప్రభుత్వం వెంటనే జీవోనం.317ను నిలిపివేసి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఉద్యోగుల సమస్యపై సీఎం స్పందించకుంటే వదిలిపెట్టే ప్రసక్తేలేదని హెచ్చరించారు. ఉద్యోగుల బదిలీల విషయంలో తాము ఎలాంటి రాజకీయం చేయడం లేదని, స్థానికత, సీనియారిటీ ఆధారంగానే బదిలీలు చేయమని కోరుతున్నామని చెప్పారు. […]
జనవరిలోగా ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వాల్సిందే.. లేకపోతే అసెంబ్లీ సమావేశాలను అడ్డుకుంటాం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఇంటింటికీ ఉద్యోగం ఏమైంది పార్టీ రాష్ట్ర ఇన్చార్జ్ తరుణ్ చుగ్ సామాజికసారథి, హైదరాబాద్: బీజేపీ చేపట్టిన నిరుద్యోగ దీక్షను సీఎం కేసీఆర్ అడ్డుకుంటున్నారని, దీక్షతో ప్రభుత్వానికి వణుకు పుట్టిందని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్అన్నారు. రాత్రికి రాత్రే ర్యాలీలు, సభలు నిషేధిస్తూ జీవో ఇచ్చారన్నారు. వైపు ఉద్యోగాలు ఇవ్వాలని కోరుతుంటే ఉన్న ఉద్యోగాలను ప్రభుత్వం ఊడగొడుతోందని మండిపడ్డారు. […]
సామాజిక సారథి, హైదరాబాద్: సీఎం కేసీఆర్‌ను గద్దె దించేందుకు నిరుద్యోగ యువత, విద్యార్థులు కలసి రావాలని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పిలుపునిచ్చారు. నీరోచక్రవర్తిలా పరిపాలన కొనసాగిస్తున్నారన్నారు. ఏడాదిలో ఎక్కువ రోజులు ఫాంహౌస్‌లోనే ఉండే ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రమేనని ఎద్దేవాచేశారు. ఎంతోమంది ఆఫీసర్లు పక్షపాత వైఖరితో వ్యవహరిస్తున్నారని, అలాంటి వారి పరిస్థితి ఏమైందో ఒక్కసారి చరిత్రను చూడండి అంటూ అధికారులపై ఈటల మండిపడ్డారు. ఈ ప్రభుత్వం ఎన్నో రోజులు ఉండదని, ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడుతున్నారని ఆరోపించారు. […]