బాధితులు అవస్థలు పడుతున్నారు డబ్ల్యూహెచ్‌వో చీఫ్ టెడ్రోస్ హెచ్చరిక జెనీవా: ఒమిక్రాన్ తేలిక పాటి లక్షణాలేనని లైట్‌గా తీసుకోవద్దని ప్రపంచ ఆరోగ్య సంస్థ తీవ్రంగా హెచ్చరించింది. ఒమిక్రాన్ కూడా ప్రాణాంతకమైన వేరియంటే అని ప్రకటించింది. ఒమిక్రాన్ వేరియంట్ కారణంగా ఆస్పత్రుల్లో బాధితులు అవస్థలు పడుతున్నారని, మరణాలు కూడా నమోదవుతున్నాయని డబ్ల్యూహెచ్‌వో చీఫ్ టెడ్రోస్ అథానమ్ వెల్లడించారు. ఇదిలాఉండగా, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ డైరెక్టర్ జనరల్ బలరామ్ భార్గవ మోల్నుపిరవిర్ క్యాప్సూల్స్‌పై కీలక ప్రకటన చేశారు. […]
సామాజిక సారథి, సంగారెడ్డి: వాసవీ క్లబ్స్ ఇంటర్నేషనల్ ఉపాధ్యక్షులుగా 2022 వ సేవ సంవత్సరానికి సంగారెడ్డి పట్టణానికి చెందిన చంద శ్రీధర్ ఎన్నికయ్యారు. విజయవాడ పట్టణంలో ఆదివారం జరిగిన అంతర్జాతీయ సదస్సులో ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన చంద శ్రీధరతో అంతర్జాతీయ అద్యక్షలు పాత సుదర్శన్ ప్రమాణస్వీకారం చేయించారు. ఈ సందర్బంగా వాసవి క్లబ్ జిల్లా ప్రతినిధులు చంద శ్రీధర్ ను అభినందించారు.
ఒమిక్రాన్‌ను తట్టుకోవడానికి సిద్ధం కావాలి ప్రధాని మోడీకి సీఎం కేజ్రీవాల్ ట్వీట్ సామాజిక సారథి, న్యూఢిల్లీ: ‘ప్రపంచవ్యాప్తంగా కొత్త కరోనా వేరియెంట్ ఒమిక్రాన్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో దయచేసి అంతర్జాతీయ విమానాల రాకపోకలను ఆపండి. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజీవ్రాల్ ప్రధానమంత్రి నరేంద్రమోదీకి విజ్ఞప్తి చేశారు. మనం ఎందుకు ఆలస్యం చేస్తున్నామని హిందీలో చేసిన ట్వీట్లో కేజీవ్రాల్ అత్యవసరంగా విజ్ఞప్తి చేశారు. ‘అనేక దేశాలు ఒమిక్రాన్ ప్రభావిత దేశాల నుంచి విమానాల రాకపోకలను నిలిపి వేశాయని, కరోనా […]