Breaking News

ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై… ఎమ్మెల్యే సీతక్క ఫైర్

ఎంపీ కొమటిరెడ్డి వెంకటరెడ్డిపై ఎమ్మెల్యే సీతక్క ఫైర్

సామజిక సారథి, నారాయణపురం: మునుగోడు ఉప ఎన్నికల పోరుజోరుగా సాగుతుంది. నాయకుల మధ్య మాటల తుటాలు పెలుతున్నాయి.    కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై ఫైర్ అయ్యారు. వెంకటరెడ్డి తన తమ్ముడు రాజ్ గోపాల్ రెడ్డికి ఓటు వేయాలని. కోరుతున్న ఆడియో క్లిప్ లీక్ అయిన నేపథ్యంలో ఆమె గాటు వాక్యాలు చేశారు. వెంకట్ రెడ్డి కోవర్ట్ ఆపరేషన్ పనికి మాలిన చర్యగా అభివర్ణించారు. కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న పక్క పార్టీకి ఓటు వేయాలంటూ వెంకట్ రెడ్డి కోరడం ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు. వెంకట్ రెడ్డి ఓ దుర్మార్గుడాని, అలాంటి వ్యక్తిని కాంగ్రెస్ పార్టీ పక్కన పెట్టాల్సిందేనని మండిపడ్డారు. ఆడియో క్లిప్ పై వివరణ ఇవ్వాలని అదిష్టానం వెంకట్ రెడ్డికి షాకాజ్ నోటీసు ఇవ్వడంపై సీతక్క స్పందించారు. అధిష్టానం నోటీసుకు వెంకట్ రెడ్డి సమాధానం చెప్పాల్సిందేనన్నారు.