Breaking News

డ్రమ్ సీడర్ తో రైతులకు మేలు

డ్రమ్ సీడర్ తో రైతులకు మేలు

సారథి, రామాయంపేట: డ్రమ్​సీడర్​తో రైతులకు ఎంతో ఉపయోగం ఉందని నిజాంపేట అగ్రికల్చర్ ఆఫీసర్ సతీశ్ అన్నారు. తద్వారా కూలీల ఖర్చును తగ్గించుకోవచ్చని చెప్పారు. శనివారం ఆయన మండలంలోని కల్వకుంట గ్రామానికి చెందిన రాజా కిషన్ డ్రమ్ సీడర్ ద్వారా రెండు ఎకరాల్లో వరి సాగును పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వరి సాగు కోసం డ్రమ్ సీడర్ వాడటం ద్వారా ఎకరానికి రూ.6000 నుంచి రూ.8000 వరకు ఖర్చు తగ్గించుకోవచ్చన్నారు. కూలీల సమస్య తగ్గుతుందని, పంటకాలం తగ్గి అధిక దిగుబడులు సాధించుకోవచ్చని అన్నారు. రైతులంతా వరి సాగుచేసి సాగు ఖర్చులు తగ్గించుకోవాలని కోరారు. ఈ విధానంలో సాగు చేయడం ద్వారా చీడపీడల బెడద తగ్గుతుందని అవగాహన కల్పించారు. కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణాధికారి గణేష్ కుమార్, మాజీ సొసైటీ చైర్మన్ మధుసూదన్ రెడ్డి, కల్వకుంట రైతులు పాల్గొన్నారు.