Breaking News

Day: May 28, 2021

ర్నలిస్టులకు హ్యాండ్ కర్చీఫ్ లు పంపిణీ

జర్నలిస్టులకు హ్యాండ్ కర్చీఫ్ లు పంపిణీ

సారథి, రామగుండం ప్రతినిధి: కరోనా కష్టకాలంలో వార్తలను సేకరించి ప్రజలకు చేరవేస్తున్న గోదావరిఖని ప్రెస్, మీడియా రిపోర్టర్లకు ఏసీపీ ఉమెందర్ చేతి రుమాలు అందజేశారు. జర్నలిస్టులు వడదెబ్బ బారినపడకుండా చూసుకోవడం తమ బాధ్యత అన్నారు. కరోనా సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో గోదావరిఖని వన్ టౌన్ సీఐలు రమేశ్ బాబు, రాజ్ కుమార్ గౌడ్, ఎస్సైలు ప్రవీణ్, ఉమాసాగర్, రమేష్, సిబ్బంది పాల్గొన్నారు.

Read More
సూపర్ స్ప్రెడర్లకు కరోనా వ్యాక్సిన్

సూపర్ స్ప్రెడర్లకు కరోనా వ్యాక్సిన్

సారథి, అచ్చంపేట: నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట పట్టణంలోని ప్రభుత్వ హైస్కూలులో కరోనా సూపర్ స్ప్రెడర్ల కోసం ఏర్పాటుచేసిన వ్యాక్సినేషన్ సెంటర్ ను జిల్లా వైద్యాధికారి డాక్టర్ కె.సుధాకర్ లాల్ శుక్రవారం సందర్శించారు. నిత్యం ప్రజలతో సంబంధాలు కలిగి, వారి అవసరాలు తీర్చే రేషన్ డీలర్లు, జర్నలిస్టులు, గ్యాస్, పెట్రోల్ బంక్ కార్మికులు, ఎరువుల దుకాణదారులు, తోపుడు బండ్ల వ్యాపారులు, ఆటో, క్యాబ్ డ్రైవర్లు, డెలివరీ బాయ్స్ తదితరులకు ప్రధాన వాహకులుగా భావించి వాక్సినేషన్ స్పెషల్ డ్రైవ్ […]

Read More
లాక్ డౌన్ అమలును పరిశీలించిన డీజీపీ

లాక్ డౌన్ ను పరిశీలించిన డీజీపీ

సారథి ప్రతినిధి, రంగారెడ్డి: డీజీపీ ఎం.మహేందర్ రెడ్డి, రాచకొండ సీపీ మహేష్ భగవత్, అదనపు సీపీ సుధీర్ బాబు, ఎల్బీనగర్ డీసీపీ సన్ ప్రీతిసింగ్, వనస్థలిపురం ఏసీపీ పురుషోత్తం రెడ్డి, అబ్దుల్లాపూర్ మెట్ సీఐ స్వామి రంగారెడ్డి జిల్లా, అబ్దుల్లాపూర్ మెట్ మండలం, కొత్తగూడెం చౌరస్తా 65వ జాతీయ రహదారిపై లాక్ డౌన్ సందర్భంగా ఏర్పాటుచేసిన చెక్ పోస్టును పరిశీలించారు. పోలీసు అధికారులకు భద్రతాపరమైన సూచనలు చేశారు. చెక్ పోస్ట్ వద్ద సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. అందుకు […]

Read More
ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలి

ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలి

సారథి, రామడుగు: మాజీ ముఖ్యమంత్రి దివంగత నందమూరి తారక రామారావుకు భారతరత్న ఇవ్వాలని టీడీపీ రామడుగు మండలాధ్యక్షుడు అమిరిశెట్టి సుధాకర్ ప్రభుత్వానికి విజ్ఞప్తిచేశారు. ఎన్టీఆర్ 98వ జయంతి వేడుకలను టీడీపీ ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్లుగా భావించి కూడు, గూడు గుడ్డ అనే నినాదంతో తెలుగువారి ఆత్మగౌరవం పేరుతో టీడీపీని స్థాపించారని గుర్తుచేశారు. మద్యపాన నిషేధం, మహిళలకు ఆస్తిలో సమాన హక్కు, జనతావస్త్రాలు, పటేల్ పట్వారీ […]

Read More
కరోనాపై భయం వద్దు.. జాగ్రత్తలు మేలు

కరోనాపై భయం వద్దు.. జాగ్రత్తలు మేలు

సారథి, వేములవాడ: సిరిసిల్ల రాజన్నజిల్లాతో పాటు వేములవాడ నియోజకవర్గంలో మున్సిపల్, ఐటీశాఖ మంత్రి కె.తారక రామారావు శుక్రవారం పర్యటించారు. తదనంతరం వేములవాడ తిప్పాపూర్ లోని వంద పడకల ఆస్పత్రిని ప్రారంభించారు. కరోనా వైరస్ యావత్ ప్రపంచాన్ని అతలాకుతలం చేసిందన్నారు. కొవిడ్ తో పాటు బ్లాక్ ఫంగస్, వైట్ ఫంగస్ లాంటి వ్యాధులను నిర్మూలించడానికి విశ్వప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపారు. ఎవరూ భయభ్రాంతులకు గురికావాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. కరోనాకు వ్యాక్సినేషన్ పూర్తయితేనే నిర్మూలన సాధ్యమవుతుందన్నారు. ప్రస్తుతం ఆక్సిజన్ […]

Read More
హరితహారానికి మొక్కలు రెడీ

హరితహారానికి మొక్కలు సిద్ధం

సారథి, చిన్నశంకరంపేట: రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న హరితహారం కార్యక్రమానికి జిల్లాలోని నర్సరీల్లో మొక్కలు సిద్ధంగా ఉన్నాయని మెదక్ డీఆర్డీవో శ్రీనివాస్ తెలిపారు. శుక్రవారం ఆయన చిన్నశంకరంపేట మండలంలోని కొరివిపల్లి సంగయ్యపల్లి, కామారం గ్రామాల్లో నర్సరీలు, డంపింగ్ యార్డ్ ను పరిశీలించారు. పరిశీలనలో భాగంగా సంతృప్తి వ్యక్తంచేశారు. ఎండాకాలం అయినప్పటికీ మొక్కలు ఎండిపోకుండా చర్యలు తీసుకుంటున్న సర్పంచ్ లు, అధికారులను అభినందించారు. ఆయన వెంట ఎంపీడీవో గణేష్ రెడ్డి, ఆయా గ్రామాల సర్పంచ్ లు, పంచాయతీ […]

Read More
లాక్ డౌన్ పై డీఐజీ సమీక్ష

లాక్ డౌన్ పై డీఐజీ సమీక్ష

సారథి, ఖమ్మం: కరోనా ఉధృతి నేపథ్యంలో ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, మహబూబాబాద్ జిల్లాలో కొనసాగుతున్న లాక్ డౌన్ అమలుతీరుపై ఆయా జిల్లాల ఎస్పీలతో వరంగల్, కరీంనగర్ రేంజ్ డీఐజీ ప్రమోద్ కుమార్ శుక్రవారం ఖమ్మం పోలీస్ కమిషనర్ ఆఫీసులో సమీక్షించారు. రాష్ట్ర సరిహద్దు అంతర్గత రహదారుల చెక్ పోస్టుల్లో అమలవుతున్న లాక్ డౌన్ తీరును అడిగి తెలుసుకున్నారు. సమావేశంలో ఖమ్మం పోలీస్ కమిషనర్ విష్ణు ఎస్.వారియర్ తో పాటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ సునీల్ […]

Read More