Breaking News

Month: February 2021

నల్లగొండ గోసవడ్డది

నల్లగొండ గోసవడ్డది

ఫ్లోరైడ్​ బాధితులను ఎవరూ పట్టించుకోలేదు ఇంటింటికీ నీళ్లిచ్చి వారి బాధలు తీర్చినం గోదావరి నీటితో జిల్లారైతుల కాళ్లు కడుగుతం బీజేపీ వారు సంస్కారం నేర్చుకోవాలి సహనానికి కూడా హద్దు ఉంటది.. టైం వస్తే తొక్కిపడేస్తం ఉమ్మడి నల్లగొండ జిల్లా రైతాంగ ధన్యవాదసభలో సీఎం కేసీఆర్​ సారథి న్యూస్, నల్లగొండ: అనాదిగా నల్లగొండ జిల్లా నష్టాలు, కష్టాలకు గురైందని, ఎవరూ పట్టించుకోలేదని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్​రావు ఆవేదన వ్యక్తం చేశారు. సమైక్యపాలకులు చిన్నచూపు చూశారని ధ్వజమెత్తారు. నాగార్జునసాగర్ ​డ్యాం ఏలేశ్వరం […]

Read More
అడవిలో అగ్గిరాజుకుంటే ముప్పే

అడవిలో అగ్గిరాజుకుంటే ముప్పే

సారథి న్యూస్, ములుగు: వేసవికాలంలో అడవిలో అగ్నిప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని జిల్లా అటవీశాఖ అధికారి ప్రదీప్ కుమార్ శెట్టి తెలిపారు. వేసవిలో ఏర్పడే కార్చిచ్చు ద్వారా అడవులు, వన్యప్రాణులను సంరక్షించేందుకు జిల్లావ్యాప్తంగా ప్రణాళికలు రూపొందించామని స్పష్టంచేశారు. నాలుగు డివిజన్ల పరిధిలోని 14 అటవీక్షేత్రాల్లో కంపార్ట్​మెంట్ల వారీగా ఫైర్ లైన్స్ ఏర్పాటు పనులు చకచకా కొనసాగుతున్నాయి వెల్లడించారు. అగ్నిప్రమాదాలపై ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండేలా ప్రతి అటవీక్షేత్రం పరిధిలో ఐదుగురు ప్రత్యేక సభ్యులతో క్విక్ రెస్పాన్స్ టీం […]

Read More
సామాజిక సేవకు గుర్తింపు

సామాజిక సేవకు గుర్తింపు

సారథి న్యూస్, ములుగు: తరచూ సామాజిక సేవా కార్యక్రమాల్లో బిజీగా ఉండే ములుగు, భూపాలపల్లి జిల్లాల సబ్ రిజిస్ట్రార్ తస్లీమా మహమ్మద్ కు అరుదైన గుర్తింపు దక్కింది. హైదరాబాద్​కు చెందిన ఇంద్రోజిర రమేష్ అనే యువకుడు మంగళవారం ఆమె ఫొటోలతో కూడిన జ్ఞాపికను అందజేశాడు. తస్లీమా రైతు ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పేందుకు సెలవు రోజుల్లోనూ వ్యవసాయ పనులు చేస్తూ.. నిరుపేదలకు చేయూతనందిస్తూ.. అనాథలు, అభాగ్యుల ఆకలి తీరుస్తుంటారు. ఈ విషయాలను సోషల్ మీడియా ద్వారా తెలుసుకున్న […]

Read More
ఏజెన్సీలోకి గిరిజనేతరుల వలసలను నిరోధించాలి

ఏజెన్సీలోకి గిరిజనేతరుల వలసలను నిరోధించాలి

సారథి న్యూస్, నూగూరు, వెంకటాపురం: ఏజెన్సీ ప్రాంతంలోకి గిరిజనేతరుల వలసలను నిరోధించాలని ఆదివాసీ నవనిర్మాణ సేన (ఏఎన్ఎస్) ములుగు జిల్లా అధ్యక్షుడు ఎట్టి విద్యాసాగర్ ప్రభుత్వాన్ని కోరారు. మంగళవారం ఏఎన్ఎస్ మండలాధ్యక్షుడు పోలేబోయిన భార్గవ్ అధ్యక్షతన జరిగిన మండల కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. వెంకటాపురం, వాజేడు మండలంలో ఇసుక, గ్రావెల్ దందా అధికారుల అండదండలతో జరుగుతోందన్నారు. ఆదివాసీలు రాజకీయ పార్టీల కుట్రలను పసిగట్టాలన్నారు. ఏజెన్సీ ప్రాంతాన్ని విభజించి ఆదివాసీల ఐక్యతను దెబ్బతీశారని, ఏజెన్సీ ప్రాంతాన్ని అంతా […]

Read More
బకాయి జీతాలు చెల్లించండి

శ్రీచైతన్య కాలేజీ లెక్చరర్ల ఆందోళన

సారథి న్యూస్, ఎల్బీనగర్: కొంతకాలంగా బకాయిలో ఉన్న జీతాలను వెంటనే చెల్లించి తమను విధుల్లోకి తీసుకోవాలని శ్రీచైతన్య కాలేజీ ఎదుట అధ్యాపకులు ఆందోళనకు దిగారు. మంగళవారం ఎల్బీనగర్ నియోజకవర్గ పరిధిలోని చైతన్యపురిలో శ్రీచైతన్య కాలేజీ బ్రాంచ్​లో క్లాస్​రూమ్​లోకి వెళ్లి అధ్యాపకులు స్వీయనిర్బంధం చేసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఏడాది కాలంగా యాజమాన్యం జీతాలు ఇవ్వకుండా వేధిస్తోందని బాధిత లెక్చరర్లు ఆవేదన వ్యక్తంచేశారు. విద్యార్థుల నుంచి లక్షలాది రూపాయల ఫీజులు వసూలు చేస్తూ.. తమకు మాత్రం జీతాలు […]

Read More
పంటలో సస్యరక్షణ పాటించాలి

పంటలో సస్యరక్షణ పాటించాలి

సారథి న్యూస్, రామాయంపేట: ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో వరి పంటలో అధిక దిగుబడులను పొందడానికి రైతులు సమగ్ర సస్యరక్షణ చర్యలు పాటించాలని కృషివిజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ రవికుమార్ సూచించారు. మంగళవారం ఆయన మండలంలోని నార్లాపూర్ గ్రామ రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం వరి పంటలో మొగి పురుగు నివారణకు కార్టాప్ హైడ్రోక్లోరైడ్ గుళికలను చల్లుకోవాలని, అలాగే అగ్గితెగులు నివారణకు ట్రైసైక్లోజోల్ లేదా కాసుగామైసీన్ ను పిచికారీ చేయాలని సూచించారు. రైతులంతా […]

Read More
‘ఆ వ్యాఖ్యలు రాజ్యాంగ వ్యవస్థను అపహాస్యం చేయడమే’

‘ఆ వ్యాఖ్యలు రాజ్యాంగ వ్యవస్థను అపహాస్యం చేయడమే’

సారథి న్యూస్, రామాయంపేట: ప్రజలు ఎంతో నమ్మకంతో విశ్వాసంతో ఓట్లేసి గెలిపించిన సీఎం కుర్చీని ఎడమకాలు చెప్పుతో సమానమని చెప్పిన సీఎం కేసీఆర్ ప్రజాస్వామ్యన్ని, రాజ్యాంగ వ్యవస్థను అవమానించినట్లేనని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు విమర్శించారు. ఫామ్ హౌస్ ను వదలని.. ప్రగతి భవన్ ను దాటని ముఖ్యమంత్రి రాజీనామా చేసి చేతనైనవారికి పాలన వ్యవస్థను అప్పగించాలని హితవుపలికారు. సోమవారం ఆయన నిజాంపేట మండల కేంద్రంలో బిర్యానీ సెంటర్ ప్రారంభోత్సవానికి హాజరయ్యారు. ప్రజలు ఓట్లేసి గెలిపించిన ఆ […]

Read More
జోగుళాంబదేవి వార్షిక బ్రహ్మోత్సవాలకు రండి

జోగుళాంబదేవి వార్షిక బ్రహ్మోత్సవాలకు రండి

సారథి న్యూస్, హైదరాబాద్: ఫిబ్రవరి 12 నుంచి 16వ తేదీ వరకు అలంపూర్ లో జరిగే జోగుళాంబదేవి వార్షిక బ్రహ్మోత్సవాలకు ఆహ్వానిస్తూ సోమవారం ప్రగతి భవన్ లో సీఎం కె.చంద్రశేఖర్ రావును కలిసి ఆహ్వాన పత్రిక అందజేశారు. ఆయన కలిసిన వారిలో దేవాదాయశాఖ మంత్రి ఏ.ఇంద్రకరణ్ రెడ్డి, ప్రభుత్వ విప్ ​గువ్వల బాలరాజ్​, ఎమ్మెల్యే డాక్టర్ అబ్రహం, ఎమ్మెల్సీ శేరి సుభాష్​రెడ్డి, ఆలయ కమిటీ చైర్మన్ రవిప్రకాశ్ గౌడ్ తదితరులు ఉన్నారు.

Read More