Breaking News

Month: February 2021

పేద పిల్లలకు బియ్యం పంపిణీ

పేద పిల్లలకు బియ్యం పంపిణీ

సారథి న్యూస్, వాజేడు: ఖమ్మం జిల్లాకు చెందిన గాస్పల్ ఫర్ ట్రైబల్ సోషల్ సర్వీస్ సొసైటీ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో శుక్రవారం ములుగు జిల్లా వాజేడు మండలంలోని బొల్లారం గ్రామంలో పేద పిల్లలకు బియ్యం, ఇతర నిత్యవసర సరుకులను ఎంపీపీ శ్యామల చేతులమీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రతిఒక్కరూ సామాజిక సేవలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సెంటర్ ఇన్​చార్జ్​నవీన్, పాస్టర్ శ్యామ్, సంస్థ సిబ్బంది మురళి కృష్ణారెడ్డి, అశోక్, సైదులు […]

Read More
కార్మికుల ఆత్మస్థైర్యం దెబ్బతీయొద్దు

కార్మికుల ఆత్మస్థైర్యం దెబ్బతీయొద్దు

సారథి న్యూస్, నాగర్​కర్నూల్: గ్రామ పంచాయతీ, మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్​చేస్తూ తెలంగాణ గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్, తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ యూనియన్​ఆధ్వర్యంలో శుక్రవారం నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని గాంధీపార్కులో ధర్నా నిర్వహించారు. అనంతరం ర్యాలీగా వెళ్లి కలెక్టరేట్ ఎదుట నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాసులు మాట్లాడుతూ.. పంచాయతీ, మున్సిపల్ కార్మికులకు కనీస వేతనం రూ.24వేలు ఇవ్వాలని డిమాండ్​చేశారు. పోరాడి సాధించుకున్న రూ.8,5‌‌‌‌00 జీతాన్ని ఇప్పటికీ […]

Read More
మట్టి అక్రమ తరలింపుపై ఫిర్యాదు

మట్టి అక్రమ తరలింపుపై ఫిర్యాదు

సారథి న్యూస్, చిన్నశంకరంపేట: చిన్నశంకరంపేట మండలం కామారం గ్రామశివారులో నూతనంగా ఏర్పాటుకానున్న ఓ కంపెనీకి ప్రభుత్వ అసైన్​మెంట్​ భూమి నుంచి అక్రమంగా మట్టిని తరలిస్తున్నారని భారతీయ కిసాన్​మోర్చా మెదక్​ జిల్లా అధ్యక్షుడు జనగామ మల్లారెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం బీజేపీ నాయకులు తహసీల్దార్​కు వినతిపత్రం అందజేశారు. కామారం గ్రామ సర్పంచ్, కాంట్రాక్టర్ కంపెనీ యాజమాన్యంతో చేతులు కలిపి రాత్రికిరాత్రే మట్టిని తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారని ఆరోపించారు. సంబంధిత వ్యక్తులతో పాటు కంపెనీ యాజమాన్యంపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. […]

Read More
వనస్థలిపురంలో కి'లేడీ' అరెస్ట్

వనస్థలిపురంలో కి’లేడీ’ అరెస్ట్

  • February 12, 2021
  • Comments Off on వనస్థలిపురంలో కి’లేడీ’ అరెస్ట్

గతంలో ఆరుగురు ఎస్సైల బ్లాక్ మెయిల్ ఎట్టకేలకు అట్రాసిటీ కేసులో అరెస్ట్​ సారథి న్యూస్​, ఎల్​బీనగర్​: అమాయకులకు వలవేసి.. అవసరాలకు వాడుకుంటూ వారిని బ్లాక్ మెయిల్ చేస్తూ పబ్బం గడుపుతున్న ఓ మాయ‘లేడీ’ని పోలీసులు గురువారం అరెస్ట్​చేశారు. పోలీసుల కథనం మేరకు.. వనస్థలిపురం పరిధిలో నివాసం ఉంటున్న ఎలిమినేటి శ్రీలతరెడ్డి స్థానికంగా టైలర్​షాపు నిర్వహిస్తోంది. కొంతకాలంగా భర్తకు దూరంగా ఉంటూ ఇద్దరు పిల్లలతో కలిసి ఇక్కడే నివాసం ఉంటోంది. కొంతమంది ఎస్సీ, ఎస్టీ సామాజికవర్గానికి చెందినవారితో గొడవపడింది. […]

Read More
జీహెచ్​ఎంసీ మేయర్​గా గద్వాల విజయలక్ష్మి

జీహెచ్​ఎంసీ మేయర్​గా గద్వాల విజయలక్ష్మి

డిప్యూటీ మేయర్​గా మోతే శ్రీలతరెడ్డి ఎన్నిక నూతన పాలకవర్గాన్నిఅభినందించిన మంత్రులు, ఎమ్మెల్యేలు సారథి న్యూస్, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్​మేయర్ గా టీఆర్ఎస్​నుంచి గెలుపొందిన బంజారాహిల్స్ కార్పొరేటర్ గద్వాల విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ గా తార్నాక టీఆర్ఎస్ కార్పొరేటర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి ఎన్నికయ్యారు. ఈ మేరకు ఎన్నికల అధికారి, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ శ్వేతామహంతి చేతులమీదుగా ధ్రువీకరణపత్రాలను గురువారం అందుకున్నారు. వారిని డిప్యూటీ స్పీకర్​ తిగుళ్ల పద్మారావుగౌడ్, మంత్రి కల్వకుంట్ల తారక రామారావు, తలసాని […]

Read More
విశ్వనగరానికి పేరు తీసుకొద్దాం

విశ్వనగరానికి పేరు తీసుకొద్దాం

అన్ని కులాలు, మతాలను ప్రేమించండి ప్రజాజీవితంలో మంచిపేరు తెచ్చుకోవాలి సంయమనం, సహనం, సాదాసీదాగా ఉండాలి మేయర్​, డిప్యూటీ మేయర్​, కార్పొరేటర్లతో సీఎం కేసీఆర్​ సారథి న్యూస్, హైదరాబాద్: విభిన్న ప్రాంతాలు, విభిన్న సంస్కృతులకు చెందిన ప్రజలు నివాసముంటున్న హైదరాబాద్ నగరం అసలు సిసలైన విశ్వనగరంగా, మినీ ఇండియాగా భాసిల్లుతున్నదని, ఈ నగర వైభవాన్ని మరింత పెంచేలా కొత్తగా ఎన్నికైన మేయర్, డిప్యూటీ మేయర్, కార్పొరేటర్లు పాటుపడాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు పిలుపునిచ్చారు. కొత్తగా ఎన్నికైన జీహెచ్ఎంసీ మేయర్ […]

Read More
కల్వకుర్తికి చేరిన రేవంత్​రెడ్డి పాదయాత్ర

కల్వకుర్తికి చేరిన రేవంత్​రెడ్డి యాత్ర

సారథి న్యూస్, కల్వకుర్తి: టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, మల్కాజ్‌గిరి ఎంపీ ఎ.రేవంత్ రెడ్డి చేపట్టిన రాజీవ్ రైతు భరోసా పాదయాత్ర నాలుగవ రోజు బుధవారం నాగర్​కర్నూల్ ​జిల్లా కల్వకుర్తికి చేరింది. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ.. శ్రీశైలం, జూరాల, పులిచింతల, శ్రీరాంసాగర్​, కల్వకుర్తి, నెట్టెంపాడు, దుమ్ముగూడెం ప్రాజెక్టులను కాంగ్రెస్​ ప్రభుత్వ హయాంలోనే నిర్మించారని గుర్తుచేశారు. టీఆర్​ఎస్​ ప్రభుత్వ పాలనపై విమర్శలు ఎక్కుపెట్టారు. ములుగు ఎమ్మెల్యే సీతక్క, మాజీ ఎంపీ మల్లు రవి, కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే, ఏఐసీసీ ప్రధాన […]

Read More
అడవి పందుల భయం ఉంటే ఫిర్యాదు చేయండి

అడవి పందుల భయం ఉంటే ఫిర్యాదు చేయండి

సారథి న్యూస్, పెద్దశంకరంపేట: పెద్దశంకరంపేట రైతువేదికలో రైతుబంధు సమితి క్యాలెండర్లను ఎంపీపీ జంగం శ్రీనివాస్ బుధవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మండల ఇన్​చార్జ్ ​వ్యవసాయాధికారి అమృత్ మాట్లాడుతూ.. పంటల మార్పిడిలో భాగంగా రైతు సోదరులు అపరాల పంటలైన మినుములు, పెసళ్లు, నూనెగింజల పంటలైన వేరుశనగ, పొద్దుతిరుగుడు పూలు వంటి పంటలను సాగుచేసుకోవాలని సూచించారు. పంటలకు అడవి పందుల భయం ఉన్నట్లయితే ఆ గ్రామసర్పంచ్​కు ఫిర్యాదు చేయాలని, శిక్షణ ఉన్న షూటర్ సహాయంతో అడవి పందులను చంపివేస్తామని తెలిపారు. […]

Read More