Breaking News

Month: February 2021

రుణాలను సకాలంలో చెల్లించాలి

రుణాలను సకాలంలో చెల్లించాలి

సారథి న్యూస్, చిన్నశంకరంపేట: బ్యాంకుల నుంచి తీసుకున్న స్త్రీనిధి రుణాలను సకాలంలో చెల్లించాలని డీఆర్డీఏ అదనపు గ్రామీణాభివృద్ధి అధికారి భీమయ్య సూచించారు. మంగళవారం మెదక్​జిల్లా చిన్నశంకరంపేట మండల సమాఖ్య సమావేశానికి ఆయన హాజరయ్యారు. ప్రతి సంఘం సమావేశాలు నిర్వహించుకోవడం, పొదుపు చేయడం, అంతర్గత అప్పులు ఉండడం, తిరిగి చెల్లింపులు చేయడం, పుస్తక నిర్వహణ సక్రమంగా ఉండటం వంటి పంచసూత్రాలు పాటించాలని సూచించారు. కుటుంబ జీవనోపాధి ప్రణాళిక ప్రకారమే రుణాలు పొంది ఆదాయభివృద్ధి కార్యక్రమాల్లో పెట్టుబడి పెట్టి ఆదాయం […]

Read More
తెలంగాణ తరహాలో జమ్మూకాశ్మీర్ అభివృద్ధి

తెలంగాణ తరహాలో జమ్మూకాశ్మీర్ అభివృద్ధి

ఢిల్లీ/ఖమ్మం: తెలంగాణ మాదిరిగానే అన్నిరంగాల్లో జమ్ముకాశ్మీర్ లో కూడా అభివృద్ధి జరగాల్సిన అవసరం ఉందని టీఆర్ఎస్ లోకసభా పక్షనేత, ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు ఆకాంక్షించారు. జమ్ముకాశ్మీర్​ పునర్వ్యవస్థీకరణ చట్టసవరణ పై శనివారం లోక్ సభలో జరిగిన చర్చలో ఎంపీ నామా పాల్గొన్నారు. చట్టంలో తీసుకొచ్చిన రెండు సవరణలు అవసరమేనని అన్నారు. జమ్మూకాశ్మీర్ బిల్లు 2019లో లోక్ సభలో ప్రవేశపెట్టిన సందర్భంగా టీఆర్​ఎస్​ పూర్తిమద్దతు ఇచ్చిన విషయాన్ని గుర్తుచేశారు. అప్పుడు కూడా తాజాగా తీసుకొచ్చిన రెండు సవరణలకు […]

Read More
17న సామూహిక హరితహారం

17న సామూహిక హరితహారం

సారథి న్యూస్, రామగుండం: తెలంగాణకు హరితహారం కార్యక్రమంలో భాగంగా సింగరేణి యాజమాన్యం ఈనెల 17తేదీన ఒక్కరోజునే రెండులక్షలకు పైగా మొక్కలను సింగరేణివ్యాప్తంగా నాటాలని నిర్ణయించింది. ఈ మేరకు అన్ని ఏరియాల్లో దీనికోసం సన్నాహాలు చేస్తున్నారు. కార్యక్రమంలో సంస్థ డైరెక్టర్లు ఎస్‌.చంద్రశేఖర్‌(ఆపరేషన్స్‌,పా) కొత్తగూడెం కార్పొరేట్‌ ఏరియాలో ఎన్‌.బలరాం(ఫైనాన్స్‌, పీ అండ్​ పీ) భూపాలపల్లి ఏరియాలో డి.సత్యనారాయణరావు(ఈఎం) రామగుండం-1 ఏరియాలో పాల్గొననున్నారు. కరోనా జాగ్రత్తలను కచ్చితంగా పాటిస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని యాజమాన్యం కోరింది.

Read More
అరకు లోయలో టూరిస్టు బస్సు బోల్తా

అరకు లోయలో టూరిస్టు బస్సు బోల్తా

ఘాట్​రోడ్డులో ఘోరప్రమాదం నలుగురు దుర్మరణం 19 మందికి గాయాలు బాధితులు హైదరాబాద్ ​వాసులు విశాఖపట్నం: విశాఖపట్నం జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. శుక్రవారం రాత్రి అరకు ఘాట్‌రోడ్డులో అనంతగిరి మండలం డముకు వద్ద పర్యాటకులతో వెళ్తున్న టూరిస్టు బస్సు ఐదో నంబర్‌ మలుపు వద్ద బోల్తాపడింది. ప్రమాద సమయంలో బస్సులో 23 మంది పర్యాటకులు ఉండగా.. వారిలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. 19 మందికి గాయాలైనట్లు అనంతగిరి ఎస్సై తెలిపారు. పోలీసులు, 108 సిబ్బంది సంఘటనా స్థలానికి […]

Read More
ప్రతికేసులో నిష్పక్షపాత విచారణ

ప్రతికేసులో నిష్పక్షపాత విచారణ

సారథి న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం: ప్రతి కేసులో నిష్పక్షపాతంగా వ్యవహరిస్తూ సమగ్ర విచారణ చేపట్టాలని భద్రాద్రి కొత్తగూడెం ఎస్పీ సునీల్​దత్​ జిల్లా పోలీసు అధికారులకు సూచించారు. శుక్రవారం జిల్లా ఎస్పీ ఆఫీసులో పాల్వంచ, కొత్తగూడెం సబ్ డివిజన్ పోలీస్ ఆఫీసర్లతో నేరాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేసుల వివరాలను ఆన్​లైన్​లో నిక్షిప్తం చేయాలని సూచించారు. సమగ్ర విచారణ జరిపి నేరస్తులకు శిక్షపడేలా చూడాలన్నారు. ఆన్​లైన్ ​ద్వారా అర్జీలు తీసుకునేలా అధికారులకు అవగాహన […]

Read More
కేఎంపీఎల్ పెంపుతోనే సంస్థకు మనుగడ

కేఎంపీఎల్ పెంపుతోనే ఆర్టీసీకి మనుగడ

సారథి న్యూస్, కల్వకుర్తి: ఇంధన పొదుపుతోనే ఆర్టీసీ సంస్థ మనుగడ సాధిస్తుందని, కార్పొరేషన్​ అభివృద్ధికి ప్రతిఒక్కరూ అంకితభావంతో పనిచేయాలని ఆర్టీసీ డివిజినల్ మేనేజర్ ఉషాదేవి అన్నారు. శుక్రవారం కల్వకుర్తి డిపోలోని డీఎం సుధాకర్ యాదవ్ అధ్యక్షతన జరిగిన ‘జాతీయ రోడ్డుభద్రతా మాసోత్సవాలు, ఇంధన సంరక్షణ క్షమత’ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కల్వకుర్తి డిపోను ప్రమాదరహిత డిపోగా మార్చాలన్నారు. అనంతరం యాక్సిడెంట్ ఫ్రీ డ్రైవర్లు అరుణ్ కుమార్, అంజయ్య, మైనోద్దీన్ కు క్యాష్ అవార్డు అందజేశారు. […]

Read More
ములుగు ఎస్పీకి కరోనా వ్యాక్సిన్​

ములుగు ఎస్పీకి కరోనా వ్యాక్సిన్​

సారథి న్యూస్, వాజేడు: ములుగు జిల్లా ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జి.పాటిల్ గురువారం ములుగు జిల్లా ఏరియా ఆస్పత్రిలో కరోనా వ్యాక్సిన్ ​తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కరోనా వైరస్ వ్యాప్తి సమయంలో జిల్లా పోలీస్ సిబ్బంది వెనకడుగు వేయకుండా తమ కుటుంబాలకు దూరంగా ఉంటూ సేవలు అందించారని కొనియాడారు. మనదేశంలో తయారైన వ్యాక్సిన్ అత్యంత సురక్షితమైందని వివరించారు. భారత శాస్త్రవేత్తలు, డాక్టర్లు తయారుచేసిన వ్యాక్సిన్ ​ప్రపంచానికి ఆదర్శంగా నిలిచిందన్నారు. కరోనా వ్యాక్సిన్ తీసుకున్న […]

Read More
పిల్లలను దూషించినా, ఇబ్బందిపెట్టినా నేరమే

పిల్లలను దూషించినా, ఇబ్బందిపెట్టినా నేరమే

సారథి న్యూస్, మెదక్: బాలల హక్కుల రక్షణ అందరి బాధ్యత అని జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్​సభ్యుడు డాక్టర్​ఆర్జీ ఆనంద్​ అన్నారు. పిల్లలతో ఫ్రెండ్లీగా ఉండడంతో పాటు వారికి ఉన్న చట్టాలను సక్రమంగా అమలు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. చిన్నారులను దూషించినా, ఇబ్బందులు కలిగించినా వెంటనే కేసులు నమోదు చేయాలని సూచించారు. శుక్రవారం మెదక్ ​కలెక్టరేట్​లోని సమావేశ మందిరంలో కలెక్టర్ ​హరీశ్ అధ్యక్షతన జిల్లా ఎస్పీ చందనాదీప్తి ఆధ్వర్యంలో ‘పిల్లలు.. వారి హక్కులు’పై జిల్లా […]

Read More